కేజీ టూ పీజీ నిర్బంధ విద్య
ఉపాధ్యాయ దినోత్సవంలో సీఎం కేసీఆర్ ఆకాంక్ష
వచ్చే ఏడాది నుంచి ప్రారంభం
ఏకీకృత సర్వీసు రూల్స్‌కోసం చర్యలు
12 ఏళ్ల తర్వాత మెుత్తం ఇంగ్లిష్ మీడియమే వస్తుంది..
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది ఇంగ్లిష్ మీడియంలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్యను ప్రారంభిస్తామని, ఈ బృహత్తర పథకం ఉపాధ్యాయుల చేతుల్లో పెరిగే పాప కావాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో శుక్రవారం జరి గిన గురుపూజోత్సవంలో సీఎం ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. కేజీ నుంచి పీజీ వరకు విద్యాసంస్థలను నియోజకవర్గానికి లేదా మండలానికి ఒకటి ప్రారంభిస్తామన్నారు. దీనిపై అందరి సల హాలు తీసుకుంటామన్నారు. అయితే తెలుగును కాపాడుకుంటూనే ప్రపంచస్థారుులో పోటీకి తట్టుకునే ఆంగ్ల మీడియంపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. అయితే ఇందులో బోధిం చే టీచర్లకు ఎలాంటి శిక్షణ అవసరం, ఎంతకా లం అవసరమనే అంశాలను నిర్ణయించాల్సి ఉందన్నారు. ఇంగ్లిష్ ఏమీ బ్రహ్మ విద్య కాదని, గట్టిగా అనుకుంటే నేర్చుకోవడానికి ఆరు నెలలు చాలని అన్నారు. టీచర్లు గట్టిగా కృషిచేస్తే పక్కా గా ఇంగ్లిష్ మీడియంలో బోధన అందించవచ్చ న్నారు. చైనా కూడా పట్టుబట్టి ఇంగ్లిష్ నేర్పిస్తోందన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో క్రియాశీలమైందన్నారు. సిలబస్ నష్టపోయినా, ఆ తరువాత సెలవుల్లో పనిచేసి సిలబస్‌ను పూర్తిచేశారని, అదీ ఉపాధ్యా యుల అంకితభావానికి నిదర్శనమని ప్రశంసిం చారు. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్ కోసం అవసరమైన చర్యలు చేపడతామన్నారు. గురువులు చదువు చెబితే బృహస్పతి అవుతార ని, చెప్పకపోతే శనిగ్రహం అవుతారన్నారు. ఈ కార్యక్రవుంలో మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట జెడ్పీ హైస్కూల్ టీచర్ యాదేశ్వరి బ్రెయిలీ లిపిలో రాసిన ‘కొత్తపల్లి జయశంకర్ చరిత్ర.. ఒడవని ముచ్చట’ పుస్తకాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమెను సన్మానించా రు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోం మంత్రి నర్సింహారెడ్డి, మంత్రి జగదీశ్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 87 మందికి నగదు, జ్ఞాపికలు, మెరిట్ సర్టిఫికెట్లు అందజేసి సన్మానించారు.
గురువుల విద్యతోనే ఈ స్థారుుకి వచ్చా
కార్యక్రవుంలో సీఎం కేసీఆర్ తన గురువులను గుర్తుచేసుకున్నారు. అందరి ముందు తాను ఇలా అనర్గళంగా మాట్లాడుతున్నానంటే అది తన గురువులు మృత్యుంజయశర్మ, రాఘవరెడ్డి అం దించిన జ్ఞానమేనన్నారు. వారుపెట్టిన అక్షర భిక్ష వల్లే తాను ఈ స్థాయికి ఎదిగానన్నారు. ఈ సం దర్భంగా వుహాభారతంలోని ఉత్తరగోగ్రహణం లో పేర్కొన్న పద్యాన్ని చదివి వినిపించారు. ఎం తో కఠినమైన ఆ పద్యాన్ని ఐదుసార్లు తరగతి గదిలోనే చూసి చదివి, ఆరోసారి చూడ కుండా అప్పగించేశానన్నారు. ఇప్పటికీ ఆ పద్యాన్ని మ రచిపోలేదంటే అది తన గురువులు అందించిన విద్య ఫలితమేనన్నారు. బాల వ్యాకరణం నుంచి మొదలుకొని సాహిత్యం వరకు అన్నీ నేర్పించారన్నారు. 9వ తరగతిలోనే ప్రబంధం, కావ్యం అం టే ఏంటో నేర్పారని, అప్పుడే చందోబద్ధమైన పద్యం రాయగలిగానంటే అది తనకు గురువులు అందించిన జ్ఞానమేనన్నారు. దుబ్బాక జెడ్పీ హైస్కూల్లో చదువుకున్నానని తెలిపారు.
సర్వేపల్లికి సీఎం నివాళి
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి సీఎం కేసీఆర్ శుక్రవారం నివాళి అర్పించారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పైనున్న రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు.
టీచర్లను ప్రోత్సహించేలా ప్రభుత్వ విధానాలుండాలి: రఘువీరారెడ్డి
సాక్షి, హైదరాబాద్: టీచర్లను ప్రోత్సహించేలా ప్రభుత్వాల చర్యలుండాలని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సూచించారు. రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం ఇందిర భవన్‌లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. రాధాకృష్ణన్ చిత్రపటానికి పూల మాలలేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సర్వేపల్లిని ఆదర్శంగా తీసుకుని నేటితరం గురువులంతా వ్యవహరించాలని సూచించారు.