లోపాలున్నప్పటికీ డీఎడ్ కాలేజీలకు రెన్యువల్ | ded colleges to permission | Sakshi
Sakshi News home page

లోపాలున్నప్పటికీ డీఎడ్ కాలేజీలకు రెన్యువల్

Published Fri, Oct 3 2014 12:18 AM | Last Updated on Tue, Sep 4 2018 5:15 PM

ded colleges to permission

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) కాలేజీల్లో నిబంధనల ప్రకారం ఉన్నవి 40 కాలేజీలే. మిగిలినవాటిలో ఏదో ఒక లోపం ఉన్నప్పటికీ 259 ప్రైవేట్ కాలేజీలకు అనుమతులను రెన్యువల్ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది. విద్యాసంవత్సరం ఆలస్యం అవుతున్నందున ఈసారికి రెన్యువల్  చే యాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ వారంలో రెన్యువల్‌కు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తర్వాత డైట్‌సెట్ కౌన్సెలింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీనికోసం తెలంగాణ, ఏపీల్లోని 2.19 లక్షల మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఏపీలోని 476కి పైగా కాలేజీలకు రెన్యువల్స్ రాలేదు. దీంతో తెలంగాణలో ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించాలని విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది.
 
 ఇదీ కాలేజీల పరిస్థితి : 199 డీఎడ్ కాలేజీల్లో ఏదో ఒక లోపం ఉన్నట్లు విద్యాశాఖ గుర్తించింది. అన్నిట్లోనూ అగ్నిప్రమాదాల నివారణకు ఏర్పా ట్లు లేవని తేలింది. ఇక 55 కాలేజీల్లోనైతే బోధన, బోధనేతర సిబ్బంది నిబంధనల మేరకు లేరు. దీంతో వీటికి ఈ ఒక్క ఏడాదికే అనుమతులను రెన్యువల్ చేసి, వచ్చేఏడాది పకడ్బందీగా తనిఖీ లు చేయాలని ప్రతిపాదించింది. తెలంగాణలో డైట్‌సెట్‌కు ప్రత్యేకంగా కన్వీనర్‌ను నియమించాలని ప్రభుత్వాన్ని కోరింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కలిపి డైట్‌సెట్-2014 జరిగింది.  వేరుగా కౌన్సెలింగ్ నిర్వహణ సాధ్యం అవుతుందా? అనేది ప్రశ్నార్థంగా మారింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement