
సాక్షి, హైదరాబాద్: విభజన అంశాల అమలుపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యహరిస్తుందని కాం గ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం సచివాలయం మీడి యా పాయింట్‌లో ఆయన మాట్లాడారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో విభజన అంశాలపై చర్చించాలని డిమాండ్ చేశారు. దీనిపై సీఎం కేసీఆర్ వెంటనే అఖిలపక్ష భేటీ నిర్వహించాలన్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల అక్కడ ఉండే 100 గ్రామాలకు ప్రమాదం ఉందని ఎస్‌కే జోషి గతంలోనే చెప్పారని, కేంద్రం దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.