‘టెట్’లో అర్హత సాధిస్తామోలేదోనని..
- వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు ఆత్మహత్య
- సోమవారం ‘కీ’ చూసుకొని మనస్తాపం
- మృతుల్లో ఒకరు ఎంపీటీసీ సభ్యురాలు
తాండూరు/వనపర్తి/అలంపూర్: టెట్‌లో అర్హత సాధిస్తామోలేదోనని మనస్తాపంతో సోమవారం వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుల్లో ఒకరు ఎంపీటీసీ సభ్యురాలు ఉన్నారు. రంగారెడ్డి జిల్లా తాండూరులోని శ్రీభావిగి భద్రేశ్వర స్వామి ఆలయంలో ప్రధాన పూజారి నాగభూషణం, వీరమణి దంపతుల కూతురు శ్వేత (20) స్థానిక శాలివాహన డిగ్రీ కళాశాలలో బీఎస్సీ (ఎంపీసీ) సెకండియర్ చదువుతోంది. ఆమె గతం లో డీఈడీ పూర్తి చేసింది. ఆదివారం నిర్వహించిన టెట్ పరీక్షకు పూజారి ముగ్గురు కూతుళ్లు శిరీష, మౌనిక, శ్వేత, కొడుకు రాజు హాజ రయ్యారు.
నగరంలోని బేగంబజార్‌లో తోటి స్నేహితులతో కలసి పరీక్ష రాసింది. సోమవా రం ఉదయం వివిధ దినపత్రికల్లో వచ్చిన టెట్ కీ పేపర్ చూసి ఆందోళనకు గురయ్యారు. తక్కువ మార్కులు వస్తాయేమోననే స్టడీ రూంలో ఉరేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ మండలం బుక్కాపురానికి చెందిన సతీష్, స్వరూప (25) దంపతులు కొంతకాలంగా వనపర్తిలోని నందీహిల్స్‌లో నివాసముంటున్నారు. స్వరూప ఆదివారం టెట్ పరీక్ష రాసింది. అర్హత సాధిస్తానో.. లేదోనని సోమవారం మనస్తాపానికి గురై ఫ్యాన్‌కు ఉరేసుకుంది. స్వరూప కాంగ్రెస్ ఎంపీటీసీ సభ్యురాలు.