తెలంగాణలో పార్టీ బలోపేతమవుతుందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ : తెలంగాణలో పార్టీ బలోపేతమవుతుందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. గాంధీభవన్లో మంగళవారం దిగ్విజయ్ అధ్యక్షతన తెలంగాణ పీసీసీ సమన్వయ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేల వలసల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు వ్యూహాలతో పాటు పార్టీ బలోపేతంపై సీనియర్ నేతలతో కసరత్తు జరిపారు. పార్టీ సీనియర్లు
అంతకు ముందు దిగ్విజయ్ సింగ్కు విమానాశ్రయంలో పార్టీ నేతలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విలేకర్ల అడిగిన ప్రశ్నకు దిగ్విజయ్ సింగ్ సమాధానమిస్తూ ఢిల్లీలో బీజేపీకి సమర్థ నాయకత్వం లేకపోవటం వల్లే కిరణ్ బేడీని తీసుకున్నారని అన్నారు.