మిర్యాలగూడ రూరల్: మద్యం సేవించి వాహనం నడుపుతున్న ఐదుగురు వ్యక్తులను మిర్యాలగూడ రూరల్ పోలీసులు సోమవారం రాత్రి పట్టుకున్నారు. రూరల్ ఎస్సై కుంట శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ– కోదాడ రహదారిపై బదలాపురం వద్ద వాహనాలు తనిఖీ నిర్వహించారు. వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించగా ముల్కలకాల్వకు చెందిన కంపసాటి వెంకన్న, రాయినిపాలెం గ్రామానికి చెందిన పిండి లలిందర్ రెడ్డి, బదలాపురానికి చెందిన దాసరి శ్రీను మద్యం తాగి పట్టుబడ్డారు. అద్దంకి–నార్కట్‌పల్లి రహదారిపై గూడూరు శివారులో తనిఖీ చేయగా గూడూరుకు చెందిన సాయికృష్ణ, బి.రాజు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడినట్లు రూరల్ ఎస్సై తెలిపారు.