
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, ఆదిలాబాద్ : జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్ పత్తి కొనుగోలు కేంద్రంలో బుధవారం ప్రతిష్టంభన ఏర్పడింది. ప్రభుత్వ మద్దతు ధర రూ. 5550 కు గాను, వ్యాపారులు రూ. 4950 మాత్రమే చెల్లిస్తుండడంతో రైతులు మండిపడ్డారు. మద్దతు ధర చెల్లించాల్సిందేనని రైతులు పట్టుబట్టడంతో కలెక్టర్ దివ్యదేవ్ రాజన్, ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపూరావు కలుగజేసుకున్నా వారి ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో విసిగిపోయిన రైతులు పంజాబ్ చౌక్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment