అమరుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు
ఉత్తర్వులు జారీచేసిన సర్కారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న అమరుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఉద్యోగానికి ఎంపిక చేసే వ్యక్తికి ఉండాల్సిన వయోపరిమితి, విద్య వంటి కనీస అర్హతలను ప్రభుత్వం సడలించింది. ఇప్పటికే ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేసిన ప్రభుత్వం, ఇల్లు, ఉచిత విద్య, ఆరోగ్య సదుపాయం, వ్యవసాయం చేసుకునే కుటుంబమైతే భూమి ఇవ్వాలని నిర్ణయిం చింది. అమరుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు జిల్లాల కలెక్టర్లను అపాయింటింగ్ అథారిటీగా నియమించిం ది. ఈ మేరకు పాటించాల్సిన మార్గదర్శకాలను ఉత్తర్వుల్లో సూచించింది.
మార్గదర్శకాలివే..
కుటుంబంలో ఉద్యోగానికి ఎంపిక చేసే వ్యక్తికి ఎలాంటి వయోపరిమితి అక్కర్లేదు. చివరి గ్రేడ్ ఉద్యోగానికి అవసరమైన విద్యార్హతను సదరు వ్యక్తి ఐదేళ్లలోగా పొందేందుకు అవకాశం కల్పించారు. అర్హత ఉన్నవారు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని కోరుకుంటే, అవసరమైతే రోస్టర్ పాయింట్లలోనూ రిలాక్సేషన్ ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. కుటుంబసభ్యుల అనుమతితో రక్త సంబంధీకులు ఎవరికైనా ఉద్యోగం ఇవ్వవచ్చు. భార్య లేదా భర్త ఆ తర్వాత పిల ్లలకు ప్రాధాన్యతను ఇవ్వాలి. జిల్లా కలెక్టర్లకు.. అవసరమైతే నిబంధనలను సడలించుకునే అధికారాన్ని ప్రభుత్వం కల్పించింది. ప్రస్తుతం ఉన్న ఖాళీల్లో నియామకాలు జరపాలని, అవసరమైతే సూపర్ న్యూమరరీ పోస్టులను సృష్టించుకోవచ్చని పేర్కొంది. మార్గదర్శకాలను అనుసరించి ఉద్యోగ నియామకపత్రాలను జారీచేయాలని ఆదేశించింది.