ఆ ముఠా గుట్టురట్టు | group arested for doing prostitution | Sakshi
Sakshi News home page

ఆ ముఠా గుట్టురట్టు

Published Wed, Jun 3 2015 12:08 AM | Last Updated on Sun, Sep 3 2017 3:07 AM

ఆ ముఠా గుట్టురట్టు

ఆ ముఠా గుట్టురట్టు

హయత్‌నగర్(హైదరాబాద్): అద్దె ఇంట్లో గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠాను పోలీసులు గుట్టురట్టు చేసిన సంఘటన మంగళవారం హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... గుంటూరుకు చెందిన సత్యవతి పెద్దఅంబర్‌పేటలోని సాయినగర్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం గృహం నిర్వహిస్తోంది.

సమాచారం అందుకున్న ఎస్‌వోటీ పోలీసులు మంగళవారం దాడి చేశారు. నల్లగొండ జిల్లా రామన్నపేట మండలం ఎల్లంకి గ్రామానికి చెందిన దొండ మధుసూదన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి అనే విటులతో పాటు బెంగాలికి చెందిన ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు. మహిళను, నిర్వాహకురాలు సత్యవతిలను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారి వద్ద నుంచి 5 సెల్‌ఫోన్లు, ఓ బైకు, రూ.1500 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement