'మా పాలనకు ఈ ఎన్నికే రిఫెరెండమ్' | harish rao hopes that we will achieve majority in medak | Sakshi
Sakshi News home page

'మా పాలనకు ఈ ఎన్నికే రిఫెరెండమ్'

Published Sat, Sep 13 2014 8:10 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

'మా పాలనకు ఈ ఎన్నికే రిఫెరెండమ్' - Sakshi

'మా పాలనకు ఈ ఎన్నికే రిఫెరెండమ్'

సిద్ధిపేట: తాజాగా మెదక్ లోక్ సభకు జరిగిన ఉప ఎన్నికలే తమ పాలనకు రిఫరెండమని తెలంగాణ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ను మరోసారి గెలిపించాలని భావన ప్రజల్లో బలంగా ఉందని ఆయన తెలిపారు. శనివారం మెదక్ లోక్ సభ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మెదక్ లో పోలింగ్ తగ్గినా.. మెజార్టీ మాత్రం తగ్గదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

 

టీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో బలంగా ఉండి పార్టీని గెలిపించాలని భావన ప్రతీ ఒక్కరిలో ఉందన్నారు. వంద రోజుల పాలనపై ప్రజలు తీర్పు ఇస్తున్నారన్నారు. డిపాజిట్ కోసమే కాంగ్రెస్, బీజేపీలు పోటీ పడుతున్నాయని మంత్రి హరీశ్ రావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement