కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌పై కమిటీ | high-level committee to appoint for Contract employees regularized | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌పై కమిటీ

Published Thu, Aug 14 2014 2:53 AM | Last Updated on Sat, Sep 2 2017 11:50 AM

కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌పై కమిటీ

కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌పై కమిటీ

సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో దీర్ఘకాలంగా కాంట్రా క్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న వారిని రెగ్యులరైజ్ చేయడానికి అనుసరించాల్సిన మార్గదర్శకాల రూపకల్పనకు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అధ్యక్షతన ఓ ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పలు రకాల పోస్టుల్లో అప్పటి అవసరాల కోసం కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగులను తీసుకున్నారు. వీరిని ఎప్పటికప్పుడు ఆ ఉద్యోగాల్లో పొడిగిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యం లో గతనెలలో జరిగిన మంత్రి మండలి సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 40 వేల మంది కాం ట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయించిన సంగతి విదితమే. అందులో భాగంగానే ఈ కమిటీని నియమించింది. వూర్గదర్శకాలపై రెండు నెలల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి వి.నాగిరెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement