
ప్రతిపక్ష నేతగా జానారెడ్డి: స్పీకర్
సాక్షి, హైదరాబాద్: ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నేతగా జానారెడ్డి పేరును స్పీకర్ మధుసూదనాచారి శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. ఆ పార్టీ ఆయనను సీఎల్పీ నేతగా ఎన్నుకున్నట్టు సమాచారం అందిందని, ఈ సందర్భంగా జానారెడ్డిని ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తిస్తున్నట్టు తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి అందిన 14 సవరణలు వీగిపోయాయన్నారు. అనంతరం ఆయన ప్రసంగానికి ఆమోదం తెలుపుతున్నట్టు సభ తీర్మానం చేసింది.