
బంజారాహిల్స్: గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా అమీర్‌పేట్, పంజగుట్ట, రాజ్‌భవన్ రోడ్ల వైపు నుంచి తరలి వచ్చే వాహనాల కారణంగా ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు వైపు ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా ఖైరతాబాద్ ఫ్లై ఓవర్‌ను ట్రాఫిక్ పోలీసులు గురువారం ఉదయం నుంచి మూసివేశారు. మొబైల్ బారికేడింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసిన పోలీసులు భక్తుల వాహనాలను అనుమతించలేదు. కేవ లం ట్యాంక్‌బండ్‌లో నిమజ్జన దృశ్యాలు తిలకించేందుకు వెళ్ళే సందర్శకులకు మాత్రమే నడిచి వెళ్ళేందుకు అనుమతించారు. ఈ ఆంక్షలు శుక్రవారం సాయంత్రం వరకు కొనసాగుతాయని పంజగుట్ట ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment