వేగంగా వెళ్తున్న రెండు కార్లు ఢీకొనడంతో తల్లికొడుకు మృతి చెందారు.
నాగర్‌కర్నూలు: వేగంగా వెళ్తున్న రెండు కార్లు ఢీకొనడంతో తల్లికొడుకు మృతి చెందారు. ఈ సంఘటన బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూలు మండలం కొల్హాపూర్ గ్రామంలో జరిగింది. వివరాలు.. కొల్హాపూర్ నుంచి నాగర్‌కర్నూలు వెళ్తున్న తుఫాన్ వాహనం నాగర్‌కర్నూలు నుంచి అచ్చంపేట వెళ్తున్న ఇండికా కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో పెద్దగుట్లపల్లి మండలం గండ్రావుపల్లి గ్రామానికి చెందిన తల్లీకొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో మహిళ తీవ్రంగా గాయపడింది. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన మహిళను మెరుగైన వైద్యం కోసం నాగర్‌కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.