ఎంపీ కవిత పదవికి రాజీనామా చేయాలి | mp kavitha should be resigned | Sakshi
Sakshi News home page

ఎంపీ కవిత పదవికి రాజీనామా చేయాలి

Published Sun, Mar 8 2015 9:49 PM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM

mp kavitha should be resigned

కాచిగూడ: మహిళా ప్రాతినిథ్యం లేని ప్రభుత్వంలో, పార్టీలో కొనసాగుతున్న ఎంపీ కవితకు మహిళల సంక్షేమంపై మాట్లాడే అర్హత లేదని అఖిల భారత ఓబీసీ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఎం.భాగ్యలక్ష్మీ విమర్శించారు. ఆదివారం నింబోలిఅడ్డలోని కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు.

 

మహిళలకు సమాన అవకాశాలు కావాలంటే ముందుగా ఎంపీ కవిత తన పదవికి రాజీనామా చేసి ఉద్యమించాలని అన్నారు. మహిళా ప్రాతినిధ్యం లేని ప్రభుత్వానికి త్వరలోనే మహిళలు తగిన గుణపాఠం చెబుతారని ఆమె హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement