'ఆ పథకాలు కార్యకర్తల కోసమే' | nagam janardan reddy slams on trs government | Sakshi
Sakshi News home page

'ఆ పథకాలు కార్యకర్తల కోసమే'

Published Sat, Apr 18 2015 1:29 PM | Last Updated on Fri, Oct 19 2018 7:27 PM

'ఆ పథకాలు కార్యకర్తల కోసమే' - Sakshi

'ఆ పథకాలు కార్యకర్తల కోసమే'

కరీంనగర్: కాంట్రాక్టర్ల ప్రయోజనం కోసం, టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల జేబులు నింపడానికే కేసీఆర్ మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్ వంటి పథకాలను ప్రవేశపెట్టినట్టు బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి విమర్శించారు. ఈ పథకాలన్నీ అవినీతిమయమని, ఆంధ్రా గుత్తేదారులతో కేసీఆర్ మిలాఖత్ ఆయ్యారన్నారు. శనివారం కరీంనగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగం మాట్లాడారు. అకాల వర్షాలతో రైతాంగం తీవ్రంగా నష్టపోతే సీఎం కేసీఆర్ పట్టించుకోకుండా కలెక్టర్లు, ఇతర ముఖ్య యంత్రాగాన్ని హైదరాబాద్‌కు తరలించి సదస్సులు, సమీక్షల పేరుతో కాలయాపన చేస్తున్నారని తప్పుబట్టారు.

పంట నష్టంపై సర్వే చేసి తక్షణమే నివేదిక పంపితే పరిహారం ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన లక్ష ఎకరాలకు సాగునీరు, పేదలందరికీ రెండు పడకగదుల ఇళ్లు వంటి హామీలు ఏమయ్యాయని నాగం ప్రశ్నించారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో కేసీఆర్ ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకున్నాడని అన్నారు. కేసీఆర్ పాలన తుగ్లక్ పాలనలా ఉందని విమర్శించారు.

 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement