పొన్నాల అవినీతిని బయటపెడుతాం: నాయిని
హైదరాబాద్: నిరంతర విద్యుత్ సరఫరా కోసం రైతులు ఉద్యమించడంలో న్యాయం ఉందని తెలంగాణ హోంశాఖామంత్రి నాయిని నర్సింహరెడ్డి అన్నారు. వచ్చే ఏడాదిలోగా రైతుల సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామని నాయిని తెలిపారు.
కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్యలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. రాజకీయంగా లబ్ది పొందడానికే జానారెడ్డి విమర్శలు చేస్తున్నారని నాయిని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పొన్నాల అవినీతిని బయటపెడతామని నాయిని తెలిపారు.