సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) ట్రెజరీని కొత్తగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత ట్రెజరీని తెలంగాణకు కొనసాగించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ట్రెజరీని ప్రస్తుత ట్రెజరీ కార్యాలయంలో కొత్తగా ఏర్పాటు చేయాలని ఆర్థిక శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీమాంధ్రకు కొత్త రాజధాని ఏర్పాటయ్యే వరకు ఇది అమల్లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ పీడీ ఖాతాలతో సహ ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలన్నీ దీని ద్వారానే కొనసాగుతాయి.