మరోసారి కిందకు దిగిన ఎన్ హెచ్ బ్రిడ్జ్! | nh bridge gets down at keesara | Sakshi
Sakshi News home page

మరోసారి కిందకు దిగిన ఎన్ హెచ్ బ్రిడ్జ్!

Published Sun, Mar 1 2015 10:32 AM | Last Updated on Sat, Sep 2 2017 10:08 PM

nh bridge gets down at keesara

హైదరాబాద్: హైదరాబాద్ టూ విజయవాడ మార్గాన్ని కలిపై జాతీయ రహదారి (ఎన్ హెచ్) బ్రిడ్జిలో మరోసారి కదిలిక వచ్చింది. గత కొన్నేళ్లుగా ఏదో సమయంలో ఈ బ్రిడ్జి కొద్ది కొద్దిగా కిందకు దిగుతూనే ఉంది. తాజాగా కీసర 6వ బ్లాక్  బ్రిడ్జి స్వల్పంగా కదలడంతో కలవరం మొదలైంది. ఆ బ్రిడ్జి అర అంగుళం మేర కిందకు దిగింది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

మూడేళ్లలో ఈ బ్రిడ్జి మూడో సారి కిందికి దిగినా టోల్ ప్లాజా అధికారులు గానీ, ప్రభుత్వం గానీ పట్టించుకోవడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ల పుణ్యమా అని ఈ బ్రిడ్జి క్రమేపీ కిందకు దిగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement