
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ బాధితులకు చికిత్స అందిస్తున్న హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రులు వరుస శవ పంచాయితీలతో దేశవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా ఉస్మానియా ఆస్పత్రి సిబ్బంది నిర్వాకమొకటి బయటపడింది. బతికున్న మహిళ చనిపోయినట్టుగా ఆస్పత్రి సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో బాధిత మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. ఒకే వయసులో ఉన్న ఇద్దరు మహిళలు ఇటీవల ఉస్మానియాలో చేరారు. వారిలో ఒకరు కరోనాతో, మరొకరు శ్వాస సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతున్నారు. తాజాగా కరోనా బాధితురాలు మృతి చెందింది. అయితే, శ్వాస ఇబ్బందులతో ఆస్పత్రిలో చేరిన మహిళ చనిపోయిందని ఆస్పత్రి సిబ్బంది కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నతన తల్లి ఎలా చనిపోయిందని బాధితురాలి కూతరు నిలదీసింది. తప్పుడు సమాచారం ఇచ్చి భయభ్రాంతులకు గురిచేశారని పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
(చదవండి: గాంధీలో మరో శవ పంచాయితీ)
(వేములవాడలో గ్యాంగ్‌వార్‌ను తలపించే ఘటన)
Comments
Please login to add a commentAdd a comment