ఖమ్మం : ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఫరీజ్ఘర్లోని గుమ్మలగుట్ట అటవీ ప్రాంతంలో నలుగురు మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయినవారిలో ముగ్గురు మహిళా మావోయిస్టులు ఉన్నారు. వారి వద్ద నుంచి 7డిటోనేటర్లు, పెట్రోబాంబును స్వాధీనం చేసుకున్నారు. కాగా ఫర్సేగర్ పోలీసు స్టేషన్ పరిధిలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ఎదురు పడినట్లు సమాచారం.
ఈ సందర్భంగా మావోయిస్టులను లొంగిపోమ్మని హెచ్చిరించినా వారు కాల్పులు జరపగా, ప్రతిగా పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ సందర్భంగా మావోయిస్టులు పారిపోతుండగా పోలీసులు వారిని పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయినవారిలో స్థానిక దళ మహిళా కమాండర్ సోమి కడటితో పాటు మరో ఇద్దరు మహిళా మావోలను కరం, పూనెంగా పోలీసులు గుర్తించారు.
నలుగురు మావోయిస్టులు అరెస్ట్
Published Mon, Nov 10 2014 8:24 AM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM
Advertisement
Advertisement