నల్లగొండ : ‘ఆసరా’ లబ్ధిదారుల జాబితా గురువారం వెల్లడికానుంది. ఈ పథకం ద్వారా నెలవారీ పింఛన్ పొందేందుకు ఎంతమంది అర్హత సాధించారు..? అనర్హులుగా ఎంతమంది తేలారు..? అన్న వివరాలు అధికారికంగా బహిర్గతం కానున్నాయి. నిన్నామొన్నటి వరకు ఆసరా పథకంలో అర్హుల జాబి తాను ఏవిధంగా ప్రకటించాలో తెలియక, పింఛన్ల పంపిణీ ఎలా చేయాలో అర్థంగాక అధికారులు తలలు పట్టుకున్నారు. అన్నివైపుల నుంచి వస్తున్న విమర్శలు, ఒత్తిళ్లు తట్టుకోలేక కిందామీద పడ్డారు. ఎట్టకేలకు సీఎం కేసీఆర్ ఇటీవల కలెక్టర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ముందుగా అర్హుల జాబితాను వెల్లడించి ఆ తర్వాత డేటాఎంట్రీ తంతు పూర్తి చేయాలన్నారు. దీంతో ఊపరిపీల్చుకున్న అధికారులు లబ్ధిదారుల జాబితా ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో గురువారం అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలు, వార్డుల్లో ఆసరా లబ్ధిదారుల జాబితాను ప్రకటి ంచనున్నారు. అయితే అర్హత సాధించిన వారితో పాటు, అనర్హత వేటుకు గురైన వారి వివరాలను కూడా ప్రకటిస్తారు. ఈ అధికారిక జాబితాపై ప్రజల నుంచి ఆర్జీలు కూడా స్వీకరిస్తారు. దీంతో అర్హులైన వారు ఎవరైనా పింఛన్ కోల్పోతే, ఆ దరఖాస్తులను కూడా అధికారులు పునఃపరిశీలిస్తారు.
తొలి పింఛన్ వారికే...
పింఛన్ పొందేందుకు అర్హత సాధించిన వివరాలు డేటా ఎంట్రీ చేస్తారు. ఆ తర్వాత డీఆర్‌డీఏ నుంచి కలెక్టర్ ఆమోదం పొందిన పిదప ఆ జాబితాను ఎంపీడీఓలకు పంపుతారు. ఆ విధంగా డేటా ఎంట్రీ జరిగి కలెక్టర్ ఆమోదముద్ర వేసిన వాటికే తొలుత పింఛన్లు పంపిణీ చేస్తారు. ఈ లెక్కన జిల్లాలో అర్హత సాధించిన పింఛన్‌దారులు 3,12,910మంది ఉన్నా రు. దీంట్లో డేటా ఎంట్రీ పూర్తయి కలెక్టర్ ఆమోదం పొందిన వారు 2,52,669 మంది ఉన్నారు. పింఛ న్ల పంపిణీ కార్యక్రమం ఈ నెల 10 నుంచి ప్రారంభిస్తారు. ఈలోగా అర్హత సాధించిన దరఖాస్తులన్నింటి ని డేటా ఎంట్రీ పూర్తి చేస్తారు. ఒకవేళ ఏదేని సాంకేతిక కారణాల దృష్ట్యా డేటా ఎంట్రీ పూర్తికాని పక్షంలో ఆ వివరాలను సెర్ప్ (రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ)కు పంపిస్తారు. అక్కడి నుంచి ఆమోదం పొందిన పిదప వారందరికి కూడా పింఛన్లు పంపిణీ చేసేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు.
ఎంపీడీఓలపైనే భారం...
అర్హులైన వారిలో ఏ ఒక్కరూ నష్టపోకుండా ఉండేలా పింఛన్ అందించే బాధ్యత ఎంపీడీఓలపైనే ఉంది. జాబితా ప్రకటించిననాటి నుంచి ఆర్జీల స్వీకరణ, పింఛన్ల పంపిణీ వగైరా వంటివన్నీ కూడా ఎంపీడీఓలు పర్యవేక్షించాల్సి ఉంటుంది. అక్టోబర్, నవంబర్ మాసాల పింఛన్లు ఒకేసారి ఈ నెల 10 నుంచి గ్రామాలు, మున్సిపాలిటీల్లో పంపిణీ చేస్తారు. పింఛన్ పంపిణీ చేసే సమయంలో స్థానిక సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులకు విధిగా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.
‘ఆసరా’ తేలేది నేడే
Published Thu, Dec 4 2014 3:38 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement