మహిళల్లో చైతన్యం పెరగాలి | Raised awareness of women | Sakshi
Sakshi News home page

మహిళల్లో చైతన్యం పెరగాలి

Aug 20 2015 4:52 AM | Updated on Mar 21 2019 8:23 PM

మహిళల్లో చైతన్యం పెరగాలి - Sakshi

మహిళల్లో చైతన్యం పెరగాలి

మహిళలు చైతన్యవంతులైతేనే సమాజం అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ డాక్టర్ యోగితా రాణా అన్నారు...

కలెక్టర్ యోగితా రాణా
ప్రగతినగర్ /వర్ని :
మహిళలు చైతన్యవంతులైతేనే సమాజం అభివృద్ధి చెం దుతుందని కలెక్టర్ డాక్టర్ యోగితా రాణా అన్నారు. బుధవారం స్థానిక ప్రగతిభవన్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాల్లో పూర్తిస్థారుులో మరుగుదొడ్లు లేక మహిళలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. బహిరంగ మల విసర్జనకు వెళ్లడం వల్ల మహిళలకు రక్షణ లేకుండా పోతోందన్నారు. మరుగుదొడ్ల నిర్మాణంపై అధికారులు, మహిళా సం ఘాల వారు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
 
జిల్లాలో మొదటి ప్రాధాన్యతగా ప్రస్తుతం 70 వేల మరుగుదొడ్ల మంజూరుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సమావేశంలో జేసీ రవీందర్‌రెడ్డి, ఏజేసీ రాజారాం, పీడీ వెంకటేశం, రాములు తదితరులు పాల్గొన్నారు.
 
గ్రామాల అభివృద్ధికే గ్రామజ్యోతి..
గ్రామాలను అభివృద్ధి చేసేందుకే ప్రభుత్వం గ్రామజ్యోతి పథకాన్ని ప్రవేశపెట్టిందని కలెక్టర్ యోగితారాణా అన్నారు. వర్ని మండలం అక్బర్‌నగర్‌లో బుధవారం సాయంత్రం గ్రామ జ్యోతి కార్యక్రమానికి హాజరైన కలెక్టర్.. కమిటీల వివరాలు తెల్సుకున్నారు. ఒక్కో కమిటీ సభ్యులతో మాట్లాడి చేపట్టే పనులపై చర్చిం చారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతిఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకునేలా గ్రామజ్యోతి కమిటీలు శ్రద్ధ చూపాలన్నారు. చెత్త చెదారాన్ని తొల గించే పని ఒకరోజుకే పరిమితం చేయకుండా ప్రతి నెల సమయాన్ని కేటాయించాలన్నారు.  చెత్త వేయడానికి కుండీలను ఏర్పాటు చేయాలని సర్పం చ్‌కు సూచించారు.
 
వాటర్ ట్యాంక్‌ల్లో రెగ్యులర్‌గా క్లోరినేషన్ చేయాలన్నా రు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే వ్యాధులు దూరమవుతాయని అన్నారు. కార్యక్రమంలో బోధన్ ఆర్డీఒ శ్యాంప్రసాద్‌లాల్, నోడల్ అధికారి స్వర్ణలత, తహశీల్దార్ సోమేశ్వర్, ఎంపీడీఓ చందర్, ఎంఈఓ దత్తాత్రేయ, ఎస్సై అంజయ్య, సర్పంచ్ రామాగౌడ్, ఎంపీటీసీ రాములు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement