రూ.50 లక్షలకు పైగా వసూళ్లు
ఒక్కొక్కరి నుంచి రూ.50వేల పైమాటే
అధికారుల సహకారంతో ఓ కార్మిక నాయకుడి నిర్వాకం
సింగరేణిలో ఇప్పటి వరకు బొగ్గు రవాణా, క్వాలిటీ, మెడికల్ బోర్డు తదితర అక్రమాలు చూశాం. తాజాగా కార్మికుల బదిలీల్లో సైతం వసూళ్లకు తెరలేచింది. ఇందులో ఓ యూనియన్ నాయకుడు సాధారణ బదిలీలను సైతం తమ ఘనకార్యంగా చెప్పుకుంటూ అధికారుల సహకారంతో పెద్ద మొత్తంలో దండుకున్నట్లు బాధిత కార్మికుల ద్వారా తెలిసింది. - కొత్తగూడెం(ఖమ్మం)
మణుగూరు ఏరియాలోని ప్రకాశం ఖని-1 ఇంక్లైన్ మూతపడటంతో సుమారు 150 మంది కార్మికులను రెండేళ్ల నుంచి పలు దఫాలుగా బదిలీలు చేశారు. సీనియారిటీ ప్రకారం 51 మంది కార్మికులను చివరి దఫాగా 8 నెలల క్రితం కొత్తగూడెంలోని పీవీకే-5 ఇంక్లైన్, వీకే-7 ఇంక్లైన్ భూగర్భగనులకు బదిలీ చేశారు. వీరు చాలాకాలం నుంచి మణుగూరు ఏరియాలోనే పనిచేయడం, అక్కడే స్థిరపడటంతో తిరిగి అదే ఏరియాకు వెళ్లేందుకు ఆసక్తి కనపర్చారు. ఈ నేపథ్యంలో మణుగూరులోని ఓపెన్‌కాస్టులో పోస్టింగ్ కోసం అదే ఏరియాకు చెందిన ఒక యూనియన్ నాయకుడిని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఇటీవల మణుగూరు కొండాపూర్ ఓసీలో పంచ్ ఎంట్రీ ఓపెన్ చేస్తుండటంతో కొత్తగూడెం ఏరియాకు బదిలీ అయిన కార్మికులను తిరిగి మణుగూరుకు బదిలీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ సమాచారం ముందుగానే తెలుసుకున్న సదరు నాయకుడు కార్మికులతో బేరం కుదుర్చుకుని ఒక్కొక్కరి వద్ద రూ.50 వేలకు పైగానే వసూలు చేసినట్లు సమాచారం. అరుుతే ఈ విషయమ బయటకు రానీయకుండా ఉండేందుకు అతను సింగరేణిలోని పర్సన ల్ విభాగానికి చెందిన ఇద్దరు అధికారులతో కుమ్మక్కైన ట్లు సమాచారం. మొత్తం రూ.50 లక్షల వరకు వసూలుచేసి కొంత అధికారులకు ముట్టచెప్పినట్లు తెలుస్తోంది. ఈనెల 18న బదిలీలకు సంబంధించిన సర్క్యులర్ విడుద ల కావడంతో కార్మికులు తాము ఆశ్రయించిన నాయకుడే బదిలీలు చేయించాడని నమ్మారు. అయితే సీనియారిటీ ప్రకారం బదిలీలు జరిగాయని తెలుసుకున్న కార్మికులు లబోదిబోమంటున్నారు.
నిద్రపోతున్న విజిలెన్స్ విభాగం
సింగరేణిలో అవినీతిని అరికట్టేందుకు ఏర్పాటు చేసిన విజిలెన్స్ విభాగం నిద్రపోతోందనడానికి తాజా ఘటనతోపాటు అనేక ఉదాహరణలున్నారుు. రెండేళ్ల క్రితం జరి గిన మెడికల్ అన్‌ఫిట్ కుంభకోణం నుంచి మొదలు నిన్న మొన్నటి వరకు జరిగిన బదిలీలలో చోటు చేసుకున్న అక్రమాలను వెలికితీయడంలో ఈ విభాగం పూర్తిగా విఫల మైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నారుు. ఇప్పటికైనా అవినీతి అక్రమాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
దృష్టికి రాలేదు.. విచారణ చేపడతాం
బదిలీల వసూళ్ల వ్యవహారంపై సింగరేణి విజిలెన్స్ జీఎం మధుసూదన్‌రావును ‘సాక్షి’ వివరణ కోరగా ఇప్పటి వరకు ఈ విషయం తమ దృష్టికి రాలేదని, విచారణ చేపడతామని పేర్కొన్నారు.