జంట కమిషనరేట్లలో మార్పులకు శ్రీకారం
హైదరాబాద్: పోలీసు శాఖ ఆధునీకరణకు నడుం బిగించిన సర్కార్ రూ.490 కోట్లు ఖర్చు చేయనుంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచే ల క్ష్యంతో ప్రత్యేక కార్యాచరణకు సిద్ధమైంది. హైదరాబాద్, సైబరాబాద్ జంట కమిషనరేట్లకు కొత్తగా 1650 ఇన్నోవాలను, 1500 ద్విచక్ర వాహనాలను ఖరీదు చేయడంతోపాటు వాటికి జియో పొజీషన్ సిస్టం(జీపీఎస్)ను అనుసంధానం చేస్తున్నారు. సంఘటన స్థలికి 10 నిమిషాల్లోనే పోలీసులు చేరుకునేలా వ్యవస్థను పటిష్టం చేస్తున్నారు. ఇందుకు డయల్ 100లో వినూత్న మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి పోలీసు అధికారుల సమావేశంలో ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలను నెరవేర్చడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. పోలీసు శాఖలో మార్పులకు తొలుత రూ.300 కోట్లు కేటాయించాలని భావించినా.. ఇతర మౌలిక సదుపాయాలు, అవసరాల కోసం మరో రూ.190 కోట్లు పెంచినట్టు అధికార వర్గాలు తెలిపాయి.
జీపీఎస్‌తో అనుసంధానం
కొత్తగా ఖరీదు చేయనున్న ఇన్నోవా వాహనాలలో జీపీఎస్ ఏర్పాటుతో పాటు ఘటనా స్థలంలో పరిసరాలను కెమెరాలో బంధించడానికి సీసీ కెమెరాలు, అత్యవసర చికిత్స కోసం అవసరమయ్యే మెడికల్ కిట్‌లు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలకు కూడా జీపీఎస్‌ను అనుసంధానం చేయనున్నారు. ఆ వాహనంపై గస్తీలో ఉన్న బ్లూకోల్ట్స్ కానిస్టేబుళ్లకు అవసరమైన సమాచారాన్ని వెంటనే అందించడం, వారు ఎక్కడున్నారనేది కంట్రోల్ రూం నుంచి తెలుసుకునేలా చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం రెండు వేల మంది కానిస్టేబుళ ్లను హైదరాబాద్‌కు, మరో వేయి మంది కానిస్టేబుళ్లను సైబరాబాద్ కమిషనరేట్‌కు మంజూరు చేశారు. మరో మూడు వేల మంది డ్రైవర్ పోస్టులను కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రతి పోలీస్ స్టేషన్‌కు మూడు ద్విచక్రవాహనాలను కేటాయిస్తున్నారు. హైదరాబాద్‌లో శాంతి భద్రతల పరిరక్షణపై ద ృష్టి సారించిన అధికారులు విడతల వారీగా నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, కరీంనగర్ రేంజ్‌లలో కూడా జీపీఎస్ సిస్టం, ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఆధునీకరణకు రూ.490 కోట్లు
Published Wed, Jul 2 2014 1:15 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement