15 టీఎంసీలు విడుదల చేయండి
కర్ణాటక జల వనరుల మంత్రికి హరీశ్ లేఖ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జంట నగరాల ప్రజలు, నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల తాగునీటి అవస రాల నిమిత్తం ఎగువనున్న ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి తక్షణమే 15 టీఎంసీల నీటిని విడుదల చేయాలని నీటి పారుదల మంత్రి టి.హరీశ్‌రావు.. కర్ణాటక జల వనరుల మంత్రి ఎంబీ పాటిల్‌ను కోరారు. ఈ మేరకు మంగళవారం పాటిల్‌కు లేఖ రాశారు.
రాష్ట్ర ప్రాజెక్టుల్లో పూర్తిగా నీటి మట్టాలు పడిపోవడం,ప్రస్తుతమున్న నిల్వలు మరో పది రోజులకు మించి సరిపోవన్న ఆందోళన నేప థ్యంలో ఈ లేఖకు ప్రాముఖ్యత సంతరించుకుంది. ప్రస్తు తం నాగార్జునసాగర్ పరిధిలోని పుట్టంగండి నుంచి హైదరాబాద్, నల్లగొండలకు నీటి సరఫరా చేస్తున్నామని, ఇక్కడ కనీస నీటి మట్టం 510 అడుగులకు గానూ ప్రస్తుతం 500.50 అడుగులకు చేరిందని హరీశ్ పేర్కొన్నారు. సాగర్‌కు ఎలాంటి ప్రవాహాలు లేనం దున నీటి సమస్య తీవ్రమవుతోం దన్నారు. ఈ దృష్ట్యా, నారాయ ణపూర్ నుంచి తక్షణమే 15టీఎంసీలు విడుదల చేసేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
కాల్వలకు కొనసాగుతున్న విడుదల...
కాగా.. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు పూర్తిగా నిండి నా దిగువకు చుక్క వదలడం లేదు. వచ్చింది వచ్చినట్లు కాల్వలకే వదులుతున్నారు. ప్రస్తుతం ఆల్మట్టిలో 129 టీఎంసీలకు గానూ 128 టీఎంసీల నిల్వలున్నాయి. 6 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, వెయ్యి క్యూసెక్కులు కాల్వ లకు, మరో 5వేల క్యూసెక్కులు వదులుతున్నారు. నారా యణపూర్‌లో 37టీఎంసీలకు 36టీఎంసీలుండగా, 4,770 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. అయినా చుక్క కూడా వదలక పోవడంతో జూరాలకు ప్రవాహాలు తగ్గుతున్నాయి.