
‘ఎస్సై’ తుది షెడ్యూల్ విడుదల
♦ 19, 20, 27 తేదీల్లో రాత పరీక్షలు
♦ 13 నుంచి ఆన్లైన్ లో హాల్‌టిక్కెట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖలో సబ్ ఇన్ స్పెక్టర్ (సివిల్/ఏఆర్/ఎస్‌ఏఆర్/ టీఎస్‌ఎస్పీ), స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్)లో ఎస్సై (మెన్స్), అగ్నిమాపక శాఖలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ (ఎస్‌ఎఫ్‌ఓ) పోస్టులతోపాటు ఎస్సై (కమ్యూనికేషన్/ పీటీఓ) పోస్టుల భర్తీకి సంబంధించిన తుది రాత పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు శనివారం ప్రకటించింది. ఈ నెల 19, 20, 27వ తేదీల్లో రాత పరీక్షలు జరగనున్నాయి. దేహదారుఢ్య పరీక్షల్లో నెగ్గి తుది రాత పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులు ఈ నెల 13వ తేదీ ఉదయం 11 గంటల నుంచి 18వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు తమ వెబ్‌సైట్ (www.tslprb. in) నుంచి హాల్‌టిక్కెట్లను డన్ లోడ్ చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ పూర్ణచందర్‌రావు ఓ ప్రకటనలో తెలిపారు.
రిజిస్ట్రేషన్ నంబర్, ఎస్‌ఎస్‌సీ హాల్‌టిక్కెట్ నంబర్‌లను వెబ్‌సైట్‌లో నమోదు చేసి హాల్‌టిక్కెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు. హాల్‌టిక్కెట్లను డౌన్ లోడ్ చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురైతే support @tslprb.inకు ఈ–మెయిల్ చేయాలని లేదా 040– 23150362/040–23150462 ఫోన్ నంబర్ల ద్వారా సంప్రదించాలన్నారు. తుది రాత పరీక్ష తర్వాత అభ్యర్థుల ధ్రువీ కరణ పత్రాలు, ఎత్తు కొలతలు, ఆన్లైన్ దరఖా స్తులో నమోదు చేసిన వివరాలను పునఃపరిశీలి స్తామ న్నారు. ఎస్సై (సివిల్), ఎస్సై (కమ్యూనికేషన్ /పీటీఓ) 2 రాత పరీక్షలకు హాజరయ్యే అభ్య ర్థులు రెండింటి హాల్ టిక్కెట్లను పరీక్షా కేంద్రానికి తీసుకురావాలన్నారు. ఆన్లైన్ దరఖాస్తు సందర్భంగా ఎస్సై (సివిల్), ఎస్సై (కమ్యూనికేషన్/పీటీఓ) పరీక్షలను లింక్ చేయని అభ్యర్థులకు 2 పరీక్షల కోసం వేర్వేరు కేంద్రాలను కేటాయిస్తే ఈ నెల 15లోగా ఈ–మెయిల్ ద్వారా ఒకే పరీక్ష కేంద్రం కోసం విజ్ఞప్తి చేయవచ్చన్నారు.