తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికల ...
చింతమడక : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఆయన తన స్వగ్రామం అయిన చింతమడకలో ఓటు వేశారు. ఎన్నికలు జరిగినప్పుడల్లా కేసీఆర్ తన స్వగ్రామానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలసి చింతమడక వెళ్లి ఓటు వేశారు. మరోవైపు మధ్యాహ్నం 12గంటల వరకు 48 శాతం ఓటింగ్ నమోదైంది.