మెదక్ : మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి శనివారం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. రామాయంపేట మండలం కోనాపూర్లో ఆమె ఈరోజు ఉదయం ఓటు వేశారు. అలాగే మంత్రి హరీష్ రావు దంపతులు సిద్దిపేటలోని భరత్ నగర్లో ఓటు వేశారు. కాగా మెదక్ లోక్సభ ఎన్నికల బరిలో 14మంది అభ్యర్థులు ఉన్నారు. 15,43,700 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి గోమారంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ రాజీనామా చేసిన మెదక్ ఎంపీ ఎన్నికను టీఆర్‌ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్లమెంటులోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల బాధ్యతను ఏడుగురు మంత్రులు తీసుకున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా స్వయంగా ప్రచారంలో పాల్గొన్నారు. టీఆర్‌ఎస్ తరపున కొత్త ప్రభాకర్‌రెడ్డి బరిలో ఉండగా, బీజేపీ తరపున జగ్గారెడ్డి, కాంగ్రెస్ తరపున సునీత లక్ష్మారెడ్డి పోటీ చేస్తున్నారు.
ఓటు వేసిన సునీతా, పద్మా దేవేందర్ రెడ్డి
Published Sat, Sep 13 2014 9:16 AM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM
Advertisement