
ఇదీ.. వారి పంథా
విధుల్లో కఠినంగా వ్యవహరించే కలెక్టర్ కరుణ పాలనాదక్షుడిగా జేసీ ప్రశాంత్‌కు గుర్తింపు ఒత్తిళ్లకు తలొగ్గని వ్యక్తిగా కమిషనర్ సర్ఫరాజ్..
విధుల్లో కఠినంగా వ్యవహరించే కలెక్టర్ కరుణ పాలనాదక్షుడిగా జేసీ ప్రశాంత్‌కు గుర్తింపు ఒత్తిళ్లకు తలొగ్గని వ్యక్తిగా కమిషనర్ సర్ఫరాజ్..
‘‘వరంగల్ జిల్లా కలెక్టర్‌గా రావడం పుట్టింటికి వచ్చినంత ఆనందంగా ఉంది.. వరంగల్ వాసులు ప్రజల పక్షాన పోరాడితే పూర్తిస్థారుు సహకారం అందిస్తారు. జిల్లాలో పనిచేసిన రోజులు మరచి పోలేను. జిల్లా నుంచే నాకు మంచి గుర్తింపు వచ్చింది. అందరి సహకారంతో జిల్లాను అభివృద్ధి చేస్తా.. సంక్రాంతి పండుగ తర్వాత బాధ్యతలు స్వీకరిస్తా..’’అని నూతన కలెక్టర్ కరుణ ‘సాక్షి’కి సోమవారం ఫోన్‌లో తెలిపారు.
- హన్మకొండ అర్బన్
హన్మకొండ అర్బన్ / వరంగల్ అర్బన్: సీఎం కేసీఆర్ నాలుగు రోజుల పర్యటన... ప్రజాప్రతి నిధులు, అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించింది. ప్రభుత్వ పథకాల అమలులో బట్టబయలైన లోపాలతో జిల్లా అధికారుల పనితీరును ఆయన గుర్తించారు. తెలంగా ణ రెండో రాజధానిగా వరంగల్‌ను తీర్చిదిద్దే క్రమంలో అధికారుల వ్యవహార శైలి కేసీఆర్‌ను నివ్వెరపరిచింది. నాలుగో రోజు పర్యటన ముగించుకున్న సీఎం హైదరాబాద్‌కు వెళ్లా రో.. లేదో.. ఐఏఎస్ బదిలీలు చేపట్టి తన మార్క్‌ను ప్రదర్శించారు. ఏకంగా జిల్లాలోని ముగ్గురు ఉన్నతాధికారులను బదిలీ చేశారు. కలెక్టర్ కిషన్, జేసీ పౌసుమిబసును జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్లుగా బదిలీ చేయగా... అన్ని దిక్కు లా విమర్శలు ఎదుర్కొన్న కార్పొరేషన్ కమిషనర్ సువర్ణ పండాదాస్‌కు పోస్టింగ్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో కొత్త, పాత అధికారుల పంథాపై ప్రజలు చర్చించుకుంటున్నారు.
వాకాటి కరుణ ప్రొఫైల్
జిల్లాలో కరుణ 2009 ఫిబ్రవరి 26 నుంచి 2012 అక్టోబర్ 9 వరకు జా రుుంట్ కలెక్టర్‌గా పనిచేశారు. జిల్లాలో కలెక్టర్ శ్రీధర్ బదిలీ తరువాత సు మారు 20రోజులు కలెక్టర్‌గా(ఎఫ్‌ఏసీ) కూడా విధులు నిర్వర్తించారు. బల్దియా కమిషనర్‌గా, ‘కుడా’ వీసీ గా, జిల్లా పరిషత్ సీఈఓగా ఇన్‌చార్జ్ బాధ్యతలు చేపట్టారు.
జిల్లాపై పూర్తిస్థారుు పట్టు
జిల్లా పాలనపై పూర్తి పట్టున్నకరుణను ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్‌గా నియమించడం వల్ల పాలన సాఫీగా సాగుతుందనే అభిప్రాయాలు అన్నివర్గాల నుంచి వ్యక్తమవుతున్నారుు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బావిస్తున్న ఆహార భద్రత కార్డులు, ప్రభుత్వ భూముల వివరాలు సేకరణ, అర్హులకు ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణ వంటి కార్యక్రమాల విషయంలో కొత్త కలెక్టర్ కరుణకు పూర్తి గా అవగాహన ఉంది. జిల్లాలోని ముఖ్యమైన అన్ని రకాల ప్రభుత్వ స్థలాల, ఆక్రమణపై పూర్తిగా పట్టుంది. జిల్లాలో 2010లో రెవెన్యూ రికార్డుల నవీకరణ, మ్యూటేషన్ వంటి కార్యక్రమాలు మిషన్ మోడ్‌లో చేపట్టారు. ప్రభుత్వ భూము ల వివరాలు పూర్తిగా సేకరించి ల్యాండ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. రెవెన్యూ సిబ్బందికి జీపీఆర్‌ఎస్ పరిజ్ఞానాన్ని సెల్‌ఫోన్‌లో నిక్షిప్తంచేసి భూముల కొలతలు వేయించారు. నగరంలో విలువైన భూములకు హద్దులు పాతించారు. దేవాల యాల భూములకు కూడా పట్టాదారు పాస్‌పుస్తకాలు జారీ చేశారు. జిల్లాలో పౌర సరఫరాల వ్యవస్థను గాడిన పెట్టేందు కు రేషన్ షాపుల్లో సామాజిక తనిఖీలు నిర్వహించారు. పెద్దమొత్తాల్లో జరిమానాలు విధించారు. గ్యాస్ సరఫరాలోనూ ఇదే పద్ధతి అవలంబించారు. జిల్లాలో జేసీగా పనిచేసిన కా లంలో 2010, 2012లో మేడారం జాతర విధి నిర్వహణలో తనదైన ముద్ర వేసుకున్నారు.
సకల జనుల సమ్మెకాలంలో ఉద్యోగులు 42 రోజులపాటు ఉద్యమంలో ఉంటే... జిల్లాలో ప్రజాపంపిణీకి వ్యవస్థకు ఇబ్బంది రాకుండా చూశారు. హన్మకొండలోని వేయిస్తంభాల దేవాలయంప్రస్తుతం రో డ్డుపై నుంచి కనిపిస్తోందంటే.. అందులో పూర్తి కృషి కరుణదనే చెప్పాలి. ఏటూరునాగారం ఇసుక క్వారీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అనుమతితో ఇసుక తరలింపులో గ్రామస్తులను భాగస్వాములను చేసి చరిత్ర సృష్టించారు. జిల్లా నుంచి బదిలీపై గ్రామీణాభివృద్ధి శాఖకు వెళ్లిన కరుణ రాష్ట్ర విభజన సమయంలో అక్కడే ఉన్నారు. అనంతరం తెలంగాణకు అలాట్ అరుు ప్రస్తుతం కలెక్టర్‌గా వస్తున్నారు.
స్వరాష్ట్రంలో జిల్లా తొలి కలెక్టర్‌గా కిషన్ గుర్తింపు
జిల్లాలో 2013 జూలె 2 నుంచి కలెక్టర్‌గా ఉన్న గంగాధర కిషన్ సుమారు ఏడాదిన్నర పాటు పనిచేశారు. ముఖ్యంగా తెలంగాణ ఆవిర్భావ సమయంలో జిల్లాకు కలెక్టర్‌గా ఉండి స్వరాష్టంలో తొలి కలెక్టర్‌గా గుర్తింపు పొందారు. జిల్లా ఉద్యోగ సంఘాలను సంఘటితం చేసి ఓరుగల్లు సేవా ట్రస్టు ఏర్పాటు చేశారు. ట్రస్ట్ తొలి కార్యక్రమంగా కలెక్టర్ నివాసం ముందు అమరవీరుల కీర్తి స్తూపం ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. ఇక పరిపాలనా పరంగా జిల్లాలో ఆయన కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నారనే చెప్పాలి. కలెక్టర్, ఎస్పీలకు ప్రతిష్టాత్మకంగా నిలిచే మేడారం జాతర, కుటుంబ సర్వే, పింఛన్ల పంపిణీ వంటి కార్యక్రమాల్లో పూర్తి స్థాయి ఫలి తాలు సాధించలేక పోయారనే అపవాదు మూటగట్టుకున్నారు. జిల్లాకు ముఖ్యమంత్రి రెండు పర్యాయాలు వచ్చిన సమయంలో జిల్లా యంత్రాంగం పనితీరుపై బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కారు. నిన్నమొన్నటి పర్యటనలో అధికారుల పనితీరుపై సీఎం ఒకింత అసహనం వ్యక్తం చేశారు. దీంతో కలెక్టర్ బదిలీ ఖాయమని ప్రచారం జరిగింది. ఎట్టకేలకు ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో సమాచారం తెలియడంతో సోమవారం ఉదయం రిలీవ్ అయ్యారు.
ప్రశాంత్ పాటిల్ ప్రొఫైల్
ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ ప్రశాంత్ పా టిల్ ప్రాథమిక విద్య నుంచి బీఈ సివిల్ ఇంజనీరింగ్ వరకు మహారాష్ట్ర ముంబైలోని థానేలో చదివారు. ఐఏ ఎస్ లక్ష్యాన్ని సాధించారు. తల్లి సుశీ ల, తండ్రి జీవన్‌రావు ఏకైక కుమారుడు పాటిల్. 2011 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ప్రశాంత్ పాటిల్ జూన్, 2011 నుంచి 2012 వరకు ఏడాది పాటు ఐఏఎస్ శిక్షణ పొందారు. జూన్ 2012 నుండి 13వరకు కర్నూలులో ట్రెయినీ సబ్ కలెక్టర్‌గా శిక్షణ పొం దారు. 2013 సెప్టెంబర్ 4న ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్‌గా తొలిసారి బాధ్యతలు స్వీకరించారు. 16 నెలలపాటు ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్‌గా, ఆరు మాసాలుగా ఉట్నూరు ఐటీడీఏ పీఓగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తాజా ఉత్తర్వులతో వరంగల్ జేసీగా పదోన్నతి పొందారు. పాటిల్‌కు భార్య జ్యోతి, రెండేళ్ల కుమార్తె ఉన్నారు.
పరిపాలనా దక్షుడిగా పాటిల్...
ప్రస్తుతం జిల్లాకు జేసీగా వస్తున్న ప్రశాంత్ పాటిల్ ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్‌గా, ఉట్నూరు ఐటీడీఏ ఇన్‌చార్జ్ పీఓగా బా ధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పాటిల్‌కు ఆ జిల్లాలో మంచి పరి పాలనాదక్షుడు, సౌమ్యుడుగా గుర్తింపు ఉంది. పాటిల్‌ను సబ్‌కలెక్టర్‌గా కాకున్నా.. పీఓగా జిల్లాలోనే కొనసాగించాలని అక్కడ ప్రజలు, రాజకీయ నేతల నుంచి ఒత్తిళ్లు ఉన్నాయి.
సాదాసీదాగా పౌసుమిబసు
జిల్లాకు జేసీ కరుణ, ప్రద్యుమ్న తర్వాత అదే స్థానంలో జిల్లాకు వచ్చిన పౌసుమిబసు 2013 అక్టోబర్ 9న విధుల్లో చేరారు. విధుల్లో చేరిన నాటి నుంచి పరిపాలనపై పెద్దగా పట్టుసాధించలేక పోయారని ప్రచారం సాగింది. సాదాసీదా విధుల నిర్వహణకే పరిమితమయ్యారు. ఉన్న పనులు పక్క న పెట్టడం మినహా... కొత్తగా చేపట్టినవి లేవనే చెప్పాలి. పనిచేసిన కాలంలో చైల్డ్ కేర్ లీవ్ పేరుతో ఆమె రెండు నెలలపాటు సెలవుపై వెళ్లారు.
సర్ఫరాజ్ అహ్మద్ ప్రొఫైల్
వరంగల్ కార్పొరేషన్ కమిషనర్‌గా వస్తున్న సర్ఫరాజ్ అహ్మద్ ఉత్తరప్రదే శ్‌కు చెందినవారు. కాన్పూర్ ఐఐటీలో ఇంజనీరింగ్ పూర్తిచేసిన ఆయన 2008 సివిల్స్‌లో 26వ ర్యాంకు సాధిం చారు. 2009 బ్యా చ్‌లో ఐఏఎస్ శిక్షణ అనంతరం.. గుంటూరులో ట్రెరుునీ కలెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. 2011 సెప్టెంబర్‌లో ము లుగు సబ్ కలెక్టర్‌గా, 2012 ఆగస్టులో బదిలీపై ఏటూరునాగారం ఐటీడీఏ పీఓగా బాధ్యతలు చేపట్టారు. అక్టోబర్‌లో తన వివాహ నిమిత్తం సెలవుపై వెళ్లిన సర్ఫరాజ్ అదేనెల 17 న తిరిగి విధుల్లో చేరారు. వారం తిరక్కముందే వెలువడ్డ బ దిలీ ఉత్తర్వులతో కరీంనగర్ జాయింట్ కలెక్టర్‌గా వెళ్లారు.
ముక్కుసూటి అధికారిగా గుర్తింపు
రెండేళ్లకు పైగా పనిచేసిన వరంగల్ జిల్లాలో సర్ఫరాజ్ ము క్కుసూటి అధికారిగా పేరు తెచ్చుకున్నారు. రాజకీయ ఒత్తిళ్ల కు తలొగ్గకుండా విధులు నిర్వర్తించేవారని గుర్తింపుపొందా రు. ఇసుక రీచ్‌ల వేలం విషయంలో తన మాట విననందు కు.. జిల్లాకు చెందిన అప్పటి కేంద్ర మంత్రి బలరాంనాయ క్.. సర్ఫరాజ్ బదిలీకి పట్టుబట్టినట్లు ప్రచారం జరిగింది. ఐటీడీఏ పీఓగా పనిచేసిన కాలం లో ట్రాన్స్‌కో సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు సర్ఫరాజ్‌పై వివాదం తలెత్తింది. అప్పటి కలెక్టర్ రాహుల్‌బొజ్జా ఈ విషయంలో కలుగజేసుకుని వ్యవహారం సద్దుమణిగేలా చేశారు. అప్పట్లోనే కమిషనర్‌గా నగర పాలక సంస్థకు వస్తారని ప్రచారం జరిగినా... కరీంనగర్ జేసీగా వెళ్లారు. ప్రస్తుత బదిలీల్లో మళ్లీ జిల్లాకు వస్తున్నారు. ప్రస్తుతం కలెక్టర్‌గా వస్తున్న కరుణ జేసీగా ఉన్నప్పుడు సర్ఫరాజ్ ములుగు సబ్‌కలెక్టర్‌గా ఉన్నారు.
పండాదాస్ పాలనలో మసకబారిన ప్రతిష్ట
ప్రస్తుత నగర పాలక సంస్థ కమిషనర్ సువర్ణపాండాదాస్ గతంలో జిల్లాలోని ములుగు సబ్‌కలెక్టర్‌గా పనిచేశారు. యువ అధికారి కమిషనర్‌గా రావడంతో పరిపాలన గాడిన పడుతుందని అంతా భావించారు. కానీ.. కార్పొరేషన్‌లో పాలన అస్తవ్యస్తంగా మారడంతోపాటు బల్దియూ ప్రతిష్ట తగ్గుతూ వచ్చింది. సమగ్రకుటుంబ సర్వే, పింఛన్ల పంపిణీ, ఆహారభద్రత కార్డుల విషయాల్లో కార్పొరేషన్ పనితీరుపై జనం దుమ్మెత్తి పోశారు. సీఎం కేసీఆర్ పర్యటన సమయంలోనూ ఇదేతీరు కొనసాగింది. గతంలో ఎన్నడూ లేనంతగా కార్పొరేషన్ అధికారుల తీరుపై ఆగ్రహంగా ఉన్న సీఎం... కమిషనర్ బదిలీకి అప్పుడు సంకేతాలిచ్చారు. ఇప్పటికీ కమిషనర్‌కు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకపోవడం గమనార్హం.