నేడు, రేపు జిల్లాలో ఎంపీ పర్యటన | today and tomorrow MP tour in district | Sakshi
Sakshi News home page

నేడు, రేపు జిల్లాలో ఎంపీ పర్యటన

Published Tue, Sep 30 2014 2:04 AM | Last Updated on Sat, Sep 2 2017 2:07 PM

నేడు, రేపు జిల్లాలో ఎంపీ పర్యటన

నేడు, రేపు జిల్లాలో ఎంపీ పర్యటన

ఖమ్మం కల్చరల్: ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈనెల 30, అక్టోబర్ 1వ తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నట్లు ఎంపీ క్యాంప్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా ఆయన పలు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈనెల 30న ఉదయం 9 గంటలకు ఖమ్మం నగరంలోని యూపీహెచ్ కాలనీలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు తిరుమలాయపాలెం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించే మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరవుతారు.

 మధ్యాహ్నం 3 గంటలకు కారేపల్లి మండల పరిషత్ కార్యాలయంలో మండలస్థాయి అధికారుల సమావేశంలో, అనంతరం కారేపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. అక్టోబర్1న ఉదయం 9 గంటలకు బోనకల్ మండలంలో రావినూతల-గోవిందాపురం రహదారి, మధ్యాహ్నం 12 గంటలకు నేలకొండపల్లి మండలంలోని కొత్తకొత్తూరు-అప్పలనరసింహాపురం రహదారి నిర్మాణానికి శంఖుస్థాపన చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement