బాల్ అనుకుని బాంబుతో ఆడుతూ..
కోల్కతా: గుండ్రంగా ఉందికదా బంతేనేమో అనుకుని బాంబుతో ఆటలాడిన నాలుగేళ్ల బాలుడు.. అది పేలడంతో తీవ్రగాయాలపాలై దుర్మరణం చెందాడు. విషాదం రేపిన ఈ ఘటన ఉత్తర కోల్కతాలోని తాళా పార్క్ ప్రాంతంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది.
ఇంటిదగ్గర ఆడుకుంటున్న భుట్టో అనే నాలుగేళ్ల బాలుడికి కొద్దిగా దూరంలో ఓ గుండ్రటి ఆకారం కనబడింది. అది బంతేనని భావిచిన బాలుడు.. దాన్ని చేతుల్లోకి తసుకుని కిందికీ, పైకి విసురుతూ ఆడుకునే ప్రయత్నం చేశాడు. ప్రమాదవశాత్తు బాంబు పేలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చేరిన కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయాడు.
పేలుడు ధాటికి ఆ ప్రాంతమంతా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. రంగంలోకి దిగిన బాంబ్ డిస్పోజల్ బలగాలు తాళా పార్క్ సమీపంలోనే మరో రెండు నాటు బాంబులను వెలికితీశారు.