పశ్చిమ బెంగాల్ కు పెనుముప్పు తప్పింది. కోల్ కతా నగరంలో లోకల్ ట్రైన్లు తిరిగే ట్రాక్ పై గుర్తుతెలియని దుండగులు అమర్చిన బాంబును భద్రతా దళాలు వెలికితీశాయి.
కోల్కతా: పశ్చిమ బెంగాల్ కు పెనుముప్పు తప్పింది. కోల్ కతా నగరంలో లోకల్ ట్రైన్లు తిరిగే ట్రాక్ పై గుర్తుతెలియని దుండగులు బాంబును అమర్చారు. అదృష్టవశాత్తూ పేలుడు సంభవించక ముందే భద్రతా సిబ్బంది బాంబును వెలికితీశారు. ఈ కారణంగా కొద్ది గంటలపాటు కోల్ కతాలో రైల్వే సేవలు నిలిచిపోయాయి.
శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో నగరంలోని పార్క్ సర్కస్, సీల్దా సౌత్ స్టేషన్ల మధ్య బాంబును గుర్తించినట్లు, ముందు జాగ్రత్త చర్యగా రైళ్లన్నీ నిలిపివేసినట్లు తూర్పు రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది. ఆర్పీఎఫ్, జీఆర్పీ బలగాలు సంఘటనా స్థలికి చేరుకుని బాంబును వెలికి తీశాయని, ప్రస్తుతం రైళ్ల రాకపోకలకు ఎలాంటి అవాంతరాలు లేవని పేర్కొంది.