'కేసీఆర్ను చూసి ఓట్లేయలేదు...' | DK aruna comments on TRS merger with Congress | Sakshi
Sakshi News home page

'కేసీఆర్ను చూసి ఓట్లేయలేదు...'

Published Tue, Feb 25 2014 12:29 PM | Last Updated on Wed, Aug 15 2018 9:17 PM

'కేసీఆర్ను చూసి ఓట్లేయలేదు...' - Sakshi

'కేసీఆర్ను చూసి ఓట్లేయలేదు...'

న్యూఢిల్లీ : కాంగ్రెస్-టీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య విలీనంపై మాటల యుద్ధం కొనసాగుతోంది.ఈ అంశంపై మంత్రి డీకె అరుణ మాట్లాడుతూ పార్టీ విలీనానికి కేసీఆర్ షరతులు పెట్టడం సరికాదని అన్నారు. మంగళవారం ఆమె ఢిల్లీలో విలేకర్లతో మాట్లాడుతూ తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ను విలీనం చేస్తానని  కేసీఆరే చెప్పారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. క్లిష్టమైన పరిస్థితుల మధ్యే సోనియా గాంధీ తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ఆమోదింపచేశారన్నారు.

తెలంగాణ వాదానికే ప్రజలు ఓటు వేశారు కానీ, కేసీఆర్ను చూసి ఓట్లేయలేదని డీకె అరుణ వ్యాఖ్యానించారు. షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ చెప్పారని ఆమె తెలిపారు. అధిష్టానం ఎవరిని సీఎంను చేసినా తాము మద్దతు ఇస్తామని డీకె అరుణ తెలిపారు. కాగా తెలంగాణ ప్రాంత మంత్రులు ఈరోజు ఉదయం దిగ్విజయ్తో భేటీ అయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement