తెలంగాణలో పార్టీలు ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది.
హైదరాబాద్: తెలంగాణలో పార్టీలు ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. బుధవారం ఈ కేసును విచారించిన న్యాయస్థానం.. ఎమ్మెల్యేలు, ఎమ్మల్సీల అనర్హతకు సంబంధించి హైకోర్టు స్పీకర్కు ఆదేశాలిచ్చే విషయం రాజ్యాంగ పరిధిలో ఎక్కడైనా ఉందా అని పిటిషనర్ను ప్రశ్నించింది. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్ ప్రస్తుతంగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారని, ఆయన మళ్లీ ఆరు నెలల్లోపు ఎమ్మెల్యేగా గెలవాలన్న ప్రశ్నే ఉత్పన్నం కాదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.