విమానంలో మహిళతో అసభ్యంగా పదేపదే.. | Man indecent behaviour on woman in flight | Sakshi
Sakshi News home page

విమానంలో మహిళతో అసభ్యంగా పదేపదే..

Published Wed, Jun 21 2017 4:10 PM | Last Updated on Mon, Oct 8 2018 3:08 PM

విమానంలో మహిళతో అసభ్యంగా పదేపదే.. - Sakshi

విమానంలో మహిళతో అసభ్యంగా పదేపదే..

  • వికృతంగా ప్రవర్తించిన వ్యక్తి అరెస్టు..!
  • విమానంలో తన పక్క సీటులో కూర్చున్న మహిళపై ఓ ప్రబుద్ధుడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెను పదేపదే అసభ్యంగా తాకాడు. బాధితురాలు ఎయిర్‌హోస్టెస్‌కు ఫిర్యాదు చేసినా లాభం లేకపోయింది. ఇక గత్యంతరం లేక ఆమె సీటును మార్పించుకుంది. సీటు మార్చుకొని వెళ్లిపోతుంటే కూడా ఆ వ్యక్తి తన వెకిలి బుద్ధి ప్రదర్శించాడు. ‘నేను తాకడం నీకు నచ్చడం లేదా’ అంటూ పేర్కొన్నాడు. ఈ షాకింగ్‌ ఘటన ఢిల్లీ నుంచి ముంబై వెళ్లే విమానంలో చోటుచేసుకుంది.

    వికృతంగా ప్రవర్తించిన ఆ వ్యక్తిని ముంబైలో విమానం ల్యాండ్‌ అయిన వెంటనే అరెస్టు చేశారు. లాయర్‌ అయిన బాధితురాలు ఢిల్లీ నుంచి తిగిరి ముంబై వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడు మోహిత్‌ కన్వర్‌ గురుగావ్‌ వాసి. విమానంలో తన పక్క సీటులో కూర్చున్న అతను దగ్గరగా జరిగి అసభ్యంగా చేతులు వేయడం, అసభ్యంగా తనను తాకడం వంటివి చేశాడని, అంతేకాకుండా తన పట్ల దుర్భాషలాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement