మోదీ కొత్త ప్లాన్.. 2,3 నెలల్లో
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఉద్గారాలను నిరోధించి, ఇ- వెహికల్స్‌కు ప్రోత్సాహమిచ్చే క్రమంలో మోదీ ప్రభుత్వం కొత్త సమగ్ర వాహన పథకాన్ని తీసుకొచ్చేందుకు యోచిస్తోంది. ఈ పథకం ద్వారా 2030 నాటికి దేశంలోఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకు రావాలని ప్రయత్నిస్తోంది. బ్యాటరీలతో నడిచే రెండు, మూడు చక్రాల, బస్సుల పరిచయానికి ఉద్దేశించిన ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టబోతోంది. తద్వారా కంపెనీలకు రాయితీలను నిలిపివేసి, బ్యాటరీ లీజింగ్ వ్యూహంపై ఆధారపడి ఈ పథకం ఉండనుంది. జపాన్,చైనా లాంటి దేశాలు బ్యాటరీ లేని వాహనాలపై దృష్టిపెడుతుంటే, దానికి విరుద్ధంగా వాహన విధానాలను రూపొందించనుంది. రెండు మూడునెలలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టనున్నారని, ఆటో కంపెనీలకు పరిమిత పన్నులను ఆఫర్ చేస్తారని ది ఎకనామిక్ టైమ్స్ మంగళవారం తెలిపింది.
ఈ పథకం డ్రాఫ్ట్ చివరి దశల్లో ఉందని ప్రయివేటు వాహనాలను కూడా ఓకే గొడుగు కిందకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రతిపాదిస్తుందని రిపోర్ట్ చేసింది. 2030 నాటికి ఎలక్ర్టిక్ ఇతర ప్రత్యామ్నాయ ఇంధనంతో కలిపి హైబ్రిడ్ టెక్నాలజీతో వాహనాలను అందుబాటులోకి తెచ్చేందుకు యోచిస్తోంది. ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ అశోక్ ఝున్ఝున్వాలా ఆధ్వర్యంలో నడిచే ఈ చర్యకు భారతీయ ఆటో కంపెనీలు ఆసక్తి చూపించగా, గ్లోబల్ కంపెనీలు ఇతర రకాల హైబ్రీడ్ టెక్నాలజీకి అనుకూలంగా ఉన్నాయని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి పేర్కొన్నారు.
బ్యాటరీ రీచార్జ్ చేసుకునేందుకువీలుగా బ్యాటరీ లీజింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చ్తేఆరు. తద్వారా వాహనదారుడికి బ్యాటరీ రీచార్జ్ చేసుకునే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఇది నాన్ ఎయిర్ కండీషన్డ్ వాహనాలకు పరిమితం. ఈ నేపథ్యంలో రోడ్డు రవాణా, శక్తి, పెట్రోలియం, భారీ పరిశ్రమలు తో లింక్ అయి వున్న ఈ పథకానికి నీతి ఆయోగ్ తుది రూపునిస్తోందని సమాచారం. దీని ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల ఇంధన ఖర్చలు తగ్గించుకోవాలనిది ప్లాన్ అని నివేదించింది. సెడాన్ వాహనానికి , కిలోమీటరుకు రూ.7ఖర్చు అవుతుండగా ఎలక్ట్రిక్ కి.మీ1 రూపాయి మాత్రమే ఖర్చవుతుందని పేర్కొంది. దీంతో వాహన ధరలు 70శాతం దిగివచ్చే అవకాశం ఉందని అంచనా వ్యక్తమవుతోంది.