వియత్నాం పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం వియత్నాం ప్రధాని గుయెన్ జువాన్ ఫుక్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో దక్షిణ చైనా తదితర కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. భేటీ అనంతరం ఇరువురు నేతలు 12 ఒప్పందాలపై సంతకాలు చేశారు. రక్షణ రంగాన్ని మెరుగుపర్చుకునేందుకు వియత్నాంకు భారత్ రూ. 50వేల కోట్ల డాలర్ల ఆర్ధికసాయం చేయనున్నట్లు మోదీ ప్రకటించారు.
వియత్నాంలోని భారతీయ ప్రాజెక్టులపై ఆరా తీసిన మోదీ.. 2020 కల్లా భారత్-వియత్నాంల మధ్య 15 బిలియన్ డాలర్ల వ్యాపారమే లక్ష్యమని చెప్పారు. 50లక్షల డాలర్లతో వియత్నాంలో సాఫ్ట్ వేర్ పార్కును నిర్మిస్తామని తెలిపారు. భారత్-వియత్నాంల మధ్య జరిగిన ఒప్పందాలు దేశాల మధ్య సంబంధాలను కొత్త అధ్యాయానికి తెరతీస్తాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ చెప్పారు. శుక్రవారం వియత్నాం రాజధాని హనోయ్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఘనస్వాగతం లభించింది. వియత్నాం అధ్యక్షుడు ట్రాన్ డయ్ క్వాంట్ మోదీ ఆహ్వానించారు. మోదీకి వియత్నాం ఆర్మీ గౌరవ వందనం చేసింది. కాగా మోదీ క్యున్ సూ పగోడాను కూడా సందర్శించారు. ఇక వియత్నాం పర్యటన ముగించుకుని మోదీ చైనా బయల్దేరి వెళ్లారు.
12 ఒప్పందాలపై భారత్-వియత్నాం సంతకాలు
Published Sat, Sep 3 2016 5:16 PM | Last Updated on Wed, Aug 15 2018 2:30 PM
Advertisement