యువనటుడు పార్కింగ్ ప్లేస్లోనే ఆ పని కానిచ్చేశాడు | Restaurant bans Shia Labeouf's entry | Sakshi
Sakshi News home page

యువనటుడు పార్కింగ్ ప్లేస్లో ఆ పని కానిచ్చేశాడు

Published Sun, Jun 29 2014 8:16 PM | Last Updated on Sat, Sep 2 2017 9:34 AM

షియా లాబియోఫ్

షియా లాబియోఫ్

 లాస్ ఏంజిలెస్: హాలీవుడ్ యువ నటుడు, దర్శకుడు షియా లాబియోఫ్పై కాలిఫోర్నియాలో షెర్మాన్ ఓక్స్లోని  ‘ద లోకల్ పెజంట్’ రెస్టారెంట్ నిషేధం విధించింది. గత నెల రెస్టారెంట్ బయటి కారు పార్కింగ్ ప్రదేశంలో లాబియోఫ్ మూత్రవిసర్జన చేసినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫిమేల్ ఫస్ట్ అనే బ్రిటన్ వెబ్‌సైట్ పేర్కొంది. అయితే తన చర్యపై లాబియోఫ్ అప్పుడే క్షమాపణ చెప్పాడని...రెస్టారెంట్ లోపలకు వెళ్లి ఆహారాన్ని ఆర్డర్ చేసినా మేనేజర్ అతన్ని బయటకు వెళ్లాలంటూ మండిపడ్డాడని ఈ వ్యవహారం గురించి తెలిసిన ఒక వ్యక్తిని ఉటంకిస్తూ వెబ్‌సైట్ తెలిపింది.

ఇదిలా ఉండగా, షియా లాబియోఫ్ను ఈ నెల 26న న్యూయార్క్ పోలీసులు అరెస్ట్ చేశారు. అసభ్యంగా ప్రవర్తించినట్లు, దుర్భాషలాడినట్లు, అనుమతిలేని ప్రదేశంలోకి చొరబడినట్లు షియాపై ఆరోపణలు ఉన్నాయి.   ఈ ఆరోపణలకు సంబంధించి షియా జూలై 24న కోర్టుకు హాజరు కావలసి ఉంది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement