అడిగి మరీ గూబ గుయ్యిమనిపించుకున్నాడు! | Shia LaBeouf complies with request to punch a fan in his face | Sakshi
Sakshi News home page

అడిగి మరీ గూబ గుయ్యిమనిపించుకున్నాడు!

Published Mon, Feb 22 2016 4:21 PM | Last Updated on Sun, Sep 3 2017 6:11 PM

అడిగి మరీ గూబ గుయ్యిమనిపించుకున్నాడు!

అడిగి మరీ గూబ గుయ్యిమనిపించుకున్నాడు!

నచ్చిన స్టార్‌తో కాసేపు మాట్లాడితే ఆ కిక్కే వేరు. అందుకే సినిమా స్టార్స్ కనబడగానే.. వారితో ఫొటోలు దిగడానికి, కరచాలనం చేయడానికి ప్రజలు ఎగబడుతుంటారు.. అయితే ఇక్కడో అభిమాని మాత్రం మరీ విచిత్రంగా ప్రవర్తించాడు. తన అభిమాన హీరో కనిపించగానే.. అతన్ని అడిగి మరీ గూబ గుయ్యిమనిపించుకున్నాడు. ఈ ఘటన హాలీవుడ్ స్టార్ హీరో షియా లాబియప్‌ విషయంలో జరిగింది.

'ట్రాన్స్‌ఫార్మర్స్', 'ఫ్యూరీ' వంటి సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా పరిచితమైన ఈ స్టార్ హీరో ఈ మధ్య ఓ చిత్రమైన టీవీ రియాల్టీ షోలో పాల్గొన్నాడు. అందులో భాగంగా ఆక్స్‌ఫర్డ్‌ యూనియన్‌లోని ఓ లిఫ్ట్‌ లో 24 గంటలు గడిపాడు. ఈ సమయంలో అభిమానులు అతన్ని లిఫ్ట్‌లో కలిసి కాసేపు కబుర్లాడారు. ఈ క్రమంలో ఓ అభిమాని కూడా క్యూలో వెయిట్‌ చేసి.. తన అవకాశం రాగానే లిఫ్ట్‌ ఎక్కాడు. తానొక ఫర్మార్మెన్స్ ఆర్టిస్టునని, తనను చెంపదెబ్బ కొట్టి తన ప్రాజెక్టును పూర్తిచేయమని అతను లాబియప్‌ను కోరాడు. చూస్తూ.. చూస్తూ నిన్నెలా ముఖం మీద పంచ్‌ కొట్టాలయ్యా అంటూ లాబియప్‌ సున్నితంగా తిరస్కరించినా.. అతడు పట్టుబడటంతో గట్టిగా ఒకటి పీకాడు. ఈ నెల 19న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. లిఫ్ట్‌ తలుపులు మూసుకున్న వెంటనే లాబియప్‌ అతన్ని ఒక పంచ్‌ కొట్టినట్టు సౌండ్ వినిపించింది. తీరా అదేమిటని ఆరా తీస్తే అభిమాని అడిగి మరీ పంచ్ కొట్టించుకున్నట్టు తేలింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement