ఏఈఆర్‌ఏ చైర్మన్‌గా ఎస్.మచేంద్ర నాథన్
హైదరాబాద్: ఎయిర్‌పోర్ట్స్ ఎకనమిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఈఆర్‌ఏ) చైర్మన్‌గా ఎస్.మచేంద్రనాథన్ నియమితులయ్యారు. ఆయన గతంలో తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్‌గా, తంజావూర్ జిల్లా కలెక్టర్‌గా, వివిధ ప్రభుత్వ విభాగాలలో కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించారు. అలాగే పలు ప్రభుత్వ రంగ సంస్థలకు డెరైక్టర్‌గా వ్యవహరించారు.