ముంబై: సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) గడచిన ఐదేళ్ల కాలంలో (2008-12) అతిపెద్ద సంపద సృష్టి కంపెనీగా నిలిచింది. ఈ విషయంలో ఐటీసీని టీసీఎస్ రెండవ స్థానానికి నెట్టివేసింది. 2007-12 మధ్య కాలంలో చూస్తే... బహుళ ఉత్పత్తుల సంస్థ ఐటీసీ సంపద సృష్టిలో ముందుంది (గత ఏడాది ఆవిష్కరించిన నివేదిక ప్రకారం...). సంపద సృష్టికి సంబంధించి మోతీలాల్ ఓస్వాల్ 18వ వార్షిక అధ్యయన నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. ఇన్వెస్టర్లు నష్టపోయిన దిగ్గజ కంపెనీల జాబితా మొదటి స్థానాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆర్‌కామ్‌లు ఉన్నాయి. ముఖ్య వివరాలు...
- మార్కెట్ క్యాపిటలైజేషన్ కోణంలో గత ఐదేళ్లలో సంపద సృష్టి టాప్ 10లో టీసీఎస్, ఐటీసీసహా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా మోటార్స్, హెచ్‌యూఎల్, విప్రోలు ఉన్నాయి.
- టాప్ 10 సంపద ఛిద్రం కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఎంఎంటీసీ, ఎన్‌ఎండీసీ, డీఎల్‌ఎఫ్, రిలయన్స్ పవర్, బీహెచ్‌ఈఎల్, సెయిల్, భారతీ ఎయిర్‌టెల్, ఎన్‌టీపీసీలు నిలిచాయి.
- వేగంతో పురోగమించిన కంపెనీల్లో టీటీకే ప్రిస్టేజ్‌ది అగ్రస్థానం.