న్యూఢిల్లీ: వాఘా సరిహద్దు వద్ద ఆదివారం జరిగిన మానవబాంబు దాడిని సీపీఎం ఖండించింది. తీవ్రవాద సంస్థల నుంచి భారత్, పాకిస్థాన్ దేశాలకు ముప్పు పొంచివుందని ఈ దాడి స్పష్టం చేస్తున్నట్టుతెలిపింది.
ఇరు దేశాలు పరస్పర సహకారం ద్వారా తీవ్రవాదాన్ని ఎదుర్కొవాలని సూచించింది. సీపీఎం పొలిట్బ్యూరో ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ దాడిపై సీపీఎం తీవ్ర దిగ్భ్రాంతి, ఆందోళన వ్యక్తం చేసింది. మృతులకు సంతాపం ప్రకటించింది.
వాఘా సరిహద్దు వద్ద ఆదివారం జరిగిన మానవబాంబు దాడిలో 61 మంది మృతి చెందారు. ఈ దాడికి సంబంధించి 20 మంది అనుమానితులను భద్రతావర్గాలు అదుపులోకి తీసుకున్నాయి.
భారత్, పాక్ లకు తీవ్రవాద ముప్పు: సీపీఎం
Published Mon, Nov 3 2014 1:03 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement