ఆత్మహత్యకు పాల్పడిన హెచ్సీయూ పరిశోధక విద్యార్థి రోహిత్ కుటుంబాన్ని సీపీఎం నేతలు పరామర్శించారు.
హైదరాబాద్: ఆత్మహత్యకు పాల్పడిన హెచ్సీయూ పరిశోధక విద్యార్థి రోహిత్ కుటుంబాన్ని సీపీఎం నేతలు పరామర్శించారు. రోహిత్ మృతిపట్ల తమ సంతాపం వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి, రామచంద్ర పాశ్వాన్లు రోహిత్ ఇంటికెళ్లారు.
అనంతరం అతడి తల్లిదండ్రులను ఓదార్చి మనోధైర్యం చెప్పారు. మరోపక్క, రోహిత్ కు నివాళి అర్పిస్తూ విద్యార్థులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి హెచ్సీయూ పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు తరలివచ్చారు.