
మీడియాపై నిషేధానికి కాలం చెల్లింది: జైట్లీ
దేశంలో మీడియాపై నిషేధానికి కాలం చెల్లిందని, ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని అమలు చేయడం దాదాపు అసాధ్యమని కేంద్ర ఆర్థిక, సమాచార-ప్రసారశాఖ మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు
న్యూఢిల్లీ: దేశంలో మీడియాపై నిషేధానికి కాలం చెల్లిందని, ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని అమలు చేయడం దాదాపు అసాధ్యమని కేంద్ర ఆర్థిక, సమాచార-ప్రసారశాఖ మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ఆలిండియా రేడియో(ఏఐఆర్) సోమవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన సర్దార్ పటేల్ స్మారకోపన్యాసంలో జైట్లీ మాట్లాడుతూ వివిధ కోర్టు తీర్పులు, సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి వల్ల దేశంలో భావప్రకటనా స్వేచ్ఛ హక్కు విస్తరించిందన్నారు. అయితే ఈ హక్కు నేటికీ దుర్వినియోగమవుతున్నప్పటకీ మీడియా స్వేచ్ఛ నియంత్రణ విషయంలో ప్రభుత్వం వీలైనంత వరకు జోక్యం చేసుకోరాదని అభిప్రాయపడ్డారు.