కృత్రిమ మేధ మానవాళికి విసరనున్న సవాలు | opinion on Artificial intelligence, humanity by aakar patel | Sakshi
Sakshi News home page

కృత్రిమ మేధ మానవాళికి విసరనున్న సవాలు

Published Sun, Oct 30 2016 6:08 PM | Last Updated on Mon, Aug 20 2018 4:52 PM

కృత్రిమ మేధ మానవాళికి విసరనున్న సవాలు - Sakshi

కృత్రిమ మేధ మానవాళికి విసరనున్న సవాలు

అవలోకనం
మనిషి తన స్వయం ప్రతిపత్తిని కోల్పోవడం, ప్రభుత్వానికి ఉండే స్వయం ప్రతిపత్తి విస్తరించడం అనేదే  కృత్రిమ మేధస్సు విసిరే అతి పెద్ద సవాలు. ఒక స్వీయ చోదక కారు మనిషి కంటే సురక్షితమైనది, తప్పులు చేయనిది అయితే అదే  మెరుగైనది. దీన్ని ఆమోదిస్తే, కృత్రిమ మేధస్సు మానవ మేధస్సుకంటే ఉన్నత శ్రేణుకి చెందినది. అప్పుడిక మనుషులు తమపై నియంత్రణను ఈ కృత్రిమ మేధస్సుకు వదులుకోవాల్సి ఉంటుంది. దీని పర్యవసానాలు ఏమిటి? తెలియదు. మానవ జాతి తన  అస్తిత్వంలోని అత్యంత అసాధారణమైన దశ గుండా నేడు పయనిస్తోంది.

ముందు ముందు టెక్నలాజికల్‌ సింగ్యులారిటీ అనే పరిణామం సంభవించ నున్నదని నిపుణులు జోస్యం చెబుతున్నారు. మామూలు మాటల్లో చెప్పాలంటే సింగ్యులారిటీ అనే ఈ పదం రెండు విషయాలను సూచిస్తుంది. ఒకటి భవిష్యత్తులో మనం సృష్టించనున్న మానవ మేధస్సును మించిన తెలివితేటలు గల కృత్రిమ మేధస్సు. రెండవది ఆ కృత్రిమ మేధస్సు మానవుల వల్లకానంతటి వేగంతో సమస్యలను పరిష్కరించడం. కృత్రిమ మేధస్సును సృష్టించిన తర్వాత భవిష్యత్తు ఎలా ఉంటుందని సైతం మనిషి ఊహించజాలనంతటి అపారమైన మార్పు ఇదని నిపుణులు భావిస్తున్నారు. ఉదాహరణకు, ఈ కృత్రిమ మేధస్సు జన్యు నిర్మాణాన్ని (జెనెటిక్‌ ఇంజనీరింగ్‌) తెలుసుకోగలిగి, వ్యాధులకు సంబం ధించిన ప్రతి సమస్యను పరిష్కరించ కలుగుతుంది. ఇప్పుడు ఉన్న వారిలో అంత వరకు బతికుండే వారంతా ఆ మార్పును చూడగలుగుతారు. ఈ సమయంలో మనం ఊహించగలిగినదానికంటే ఎక్కువ వేగంగా ఆ కృత్రిమ మేధస్సు తన తెలివితేటలను పెంపొందింపజేసుకుంటుంది.

ఇంతకూ ఈ పరిణామాలు ఎప్పటికి సంభవించవచ్చు? ఇంచుమించు 2040 నాటికి, అంటే 24 ఏళ్లలో జరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొందరు ఇంకా త్వరగానే రావచ్చని కూడా అంటున్నారు. ఈ టెక్నలాజికల్‌ సింగ్యులారిటీ (సాంకే తిక ఏకైకత)ని సంశయవాద దృష్టితో చూసే నిపుణులు సైతం లేకపోలేదు. కానీ వారు కూడా ఈ పరిణామం సంభవించనున్నదనే దాన్ని నిరాకరించడం లేదు. మనం ఊహిస్తున్నదాని కంటే కొంత మెల్లగా జరుగుతుందని అంటున్నారంతే. (మానవ మేధస్సుకంటే అపారమైన తెలివి తేటలుగల కృత్రిమ మేధస్సుతో పని చేసే సాంకేతిక వ్యవస్థలు లేదా అపార మేధస్సుగల యంత్రాలను తయారు చేసే సాంకేతికతను స్థూలంగా టెక్నలాజికల్‌ సింగ్యులారిటీ అనవచ్చు).

కంప్యూటర్లు ఇప్పటికే దిగ్భ్రాంతికర వేగంతో మరింత తెలివైనవిగా మారుతున్నాయి. ఈ ఏడాది కృత్రిమ మేధస్సు ఒక నోబెల్‌ బహుమతిని గెలుచు కున్న ప్రయోగాన్ని గంటలో అర్థం చేసుకోవడమేగాక, తిరిగి చేసి చూపింది. ఈ ఏడాదే ఒక గూగుల్‌ కంప్యూటర్‌ సంక్లిష్టమైన గో అనే చైనా ఆటలో మానవ చాంపియన్‌ను ఓడించింది. గో ఆటలో చదరంగంలో కంటే ఎన్నో రెట్లు ఎక్కువ సంభావ్యతలు ఉంటాయి. కాబట్టి కంప్యూటర్‌ గెలవగలదని ఊహించనే లేదు. ఒక యంత్రం గో మానవ ప్రపంచ చాంపియన్‌ను ఓడించడం సుదూర భవిష్యత్తు   లోనే జరుగుతుందని అనుకున్నారు. ఎప్పుడో సుదూరంలో జరుగుతాయనుకున్న ఎన్నో మార్పులు ఈ ఏడాదే వచ్చేశాయి. ఉదాహరణకు, స్వీయ చోదక కార్లు. టెస్లా అనే అమెరికన్‌ కంపెనీ అమ్ముతున్న వేలాది మోటారు వాహనాలకు డ్రైవర్‌ అవ సరం లేని స్వీయచోదక శక్తి ఇప్పటికే ఉంది. ఈ కారు తన చుట్టూ ఏముందో గమ నిస్తూ, గంటకు 100 కిలోమీటర్ల వేగంతో పయనించగలదు. తన వెనుక ఏము న్నదో గ్రహించి మార్గాన్ని మార్చుకోగలుగుతుంది కూడా. ఈ కార్లలో ఒకటి ఈ ఏడాది మొదట్లో ప్రమాదానికి గురై డ్రైవర్‌ మరణించాడు. అయితే ఇప్పటికే, గత కొన్ని వారాల్లో తమ సాంకేతికతను ఎంతో మెరుగుపరచామని టెస్లా అంటోంది.  

మనలో చాలా మంది వయోజనులకు భవిష్యత్తు గురించిన ఈ చిత్రమైన కథలు కొత్తేమీ కాదు. 1980లలో జపాన్‌ కార్ల తయారీదారులు తమ ఫ్యాక్టరీలలో పెద్ద పెద్ద భాగాలను ఆటోమేషన్‌కు గురిచేసినప్పుడు రోబోలు మనుషుల ఉద్యో గాలను భర్తీ చేయడం గురించి విన్నాం. అయితే మనం భయపడినంత వేగంగా ఆ మార్పు జరగలేదు. కానీ ఈసారి ఇది విభిన్నమైనది. సమాచార సాంకేతికత ఏడాదికేడాది వేగాన్ని పుంజుకుంటూ శరవేగంతో పురోగమిస్తుండటమే అందుకు కారణం. ప్రతి రెండేళ్లకు కంప్యూటింగ్‌ (గణింపు) వేగం రెట్టింపు అవుతుండటం ఈ వేగానికి ఒక కారణం. మనలో గత పదిహేనేళ్లను గమనిస్తున్నవారంతా వాస్త వంగా సాంకేతికత ఎంత త్వరితగతిన మారిపోతోందో గమనించగలుగుతారు.

ఇంత వేగం అంటే, ప్రతి దశాబ్దికి ఈ మార్పులు అంతకు ముందటి దశాబ్ది కంటే ఎంతో ఉన్నత శ్రేణికి చెందినవిగా మారుతున్నాయని అర్థం. మనం కంప్యూ టర్ల యుగంలోకి ప్రవేశించి కొన్ని దశాబ్దాలు మాత్రమే అయింది. అందువలన వచ్చే 24 ఏళ్లలో రానున్న మార్పులను గత 24 ఏళ్లలో వచ్చిన మార్పుల వంటివిగా చూడటానికి వీల్లేదు.ఈ మార్పు పర్యవసానాలు ఏమిటో ఊహించజాలమని నిపు ణులే అంటున్నారంటే ఇది ఎంత భారీదో, గొప్పదో ఊహించుకోవచ్చు.

యూరప్‌ పౌరులతో పోలిస్తే భారత ఉపఖండంలో మనకు రానున్న ఈ మార్పు కొన్ని విధాలుగా విభిన్నమైనది. యూరోపియన్లకు పేదరికం, నిరక్షరా స్యత, పోషకాహార లోపం అనే గతం నుంచి సంక్రమించిన సమస్యలు లేవు. సాంకేతికతను  అనుమతిస్తే సులువుగానే ఈ సమస్యలు పరిష్కారమైపోతాయి.

మనిషి తన స్వయం ప్రతిపత్తిని కోల్పోవడం, ప్రభుత్వానికి ఉండే స్వయం ప్రతిపత్తి విస్తరించడం అనేదే  కృత్రిమ మేధస్సు విసిరే అతి పెద్ద సవాలు అవు తుంది. నేను చెప్పదలుచుకున్న దాని అర్థం ఇది: మానవ కృషి లేకుండానే నడు స్తుంది కాబట్టి ఒక స్వీయ చోదక కారు మనిషి కంటే మెరుగైనది అవుతుంది. అది మరింత సురక్షితమైనది, తప్పులు చేయనిది కావడం వల్ల కూడా అదే మెరుగైన దవుతుంది. ఈ సూత్రాన్ని ఆమోదించేట్టయితే, సృష్టించిన కృత్రిమ మేధస్సు మానవ మేధస్సుకంటే ఉన్నత శ్రేణుకి చెందినది, తనకు తానుగా వేగంగా తన శక్తిసామర్థ్యాలను పెంపొందింపజేసుకోగలిగేది అయితే... అప్పుడిక మనుషులు తమపై నియంత్రణను ఈ కృత్రిమ మేధస్సుకు వదులుకోవాల్సి ఉంటుంది. దీని పర్యవసానాలు ఏమిటి? నిపుణులు తమకు తెలియదని అంటున్నారు. వారిలో చాలామంది కృత్రిమ మేధస్సు మానవాళికి కలిగించగల ప్రమాదాల గురించి చాలా తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. మానవ జాతిగా మనం, మన అస్తి త్వంలోని అత్యంత అసాధారణమైన దశ గుండా పయనిస్తున్నాం. భారతీయు లలో 65 శాతం కంటే ఎక్కువ మంది 35 ఏళ్ల లోపు వయస్కులే. మనలో చాలా మంది రాబోయే ఇరవై నాలుగేళ్లను కళ్లారా చూస్తారు.

వ్యాసకర్త :  అకార్ పటేల్ కాలమిస్టు, రచయిత
aakar.patel@icloud.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement