Andhadhun
-
రీమేక్ అంత వీజీ కాదు
భాష వేరు. కాని భావం ఒక్కటే. హీరో వేరు. కాని హీరోయిజం ఒక్కటే. అక్కడ హిట్ అయితే ఇక్కడ ఎందుకు కాదు. చలో... రీమేక్ చేద్దాం. కాని రీమేక్ అంత వీజీ కాదు. అది లైఫ్ ఇవ్వగలదు. ఫ్లాప్ చేయగలదు. కనెక్ట్ అయినవీ కానివీ వచ్చినవీ రాబోతున్నవీ ఈ సండే రోజున రీ విజిట్... బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘అంధాధున్’ తాజాగా అమేజాన్‌లో రిలీజ్ అయ్యింది. ఇది ఒక థ్రిల్లర్. అనూహ్యమైన మలుపులతో కథ సాగుతుంది. అందుకే దీనిని చాలామంది రీమేక్ చేయడానికి ఉత్సాహపడ్డారు. తెలుగులో నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ రిమేక్ చేశారు. ఇక్కడే జటిలమైన సమస్య వస్తుంది. యథాతథం తీయాలా? ఏమైనా మార్పులు చేయాలా? చేస్తే నచ్చుతుందా... చేయకపోతే నచ్చుతుందా... యథాతథంగా తీస్తే కొత్తగా ఏం చేశారని అంటారు. మార్పులు చేస్తే సోల్ చెడగొట్టారని అంటారు. అందువల్ల కొందరు దర్శకులు రీమేక్‌ల జోలికి రారు. కొందరు సక్సెస్‌ఫుల్‌గా తీస్తారు. ‘అంధాధున్’ కథ హిందీలో గోవాలో నడుస్తుంది. రీమేక్‌లో ప్రారంభంలోనే గోవా అని వేస్తారు. గోవాలో తెలుగు కథ ఎందుకు జరుగుతుంది? వైజాగ్‌లో తీసి ఉంటే ఎలా ఉంటుంది? ప్రేక్షకులకు వచ్చే సందేహం. కథ కనెక్ట్ కావచ్చు. కాని ఈ రీమేక్‌లో నేటివిటి కనెక్ట్ అయ్యిందా అనేది సమస్య. ఇద్దరు దర్శకులు గతంలో రీమేక్ సినిమాల్లో ఇద్దరు దర్శకులు పేరు పొందారు. వారు కోడి రామకృష్ణ, రవిరాజా పినిశెట్టి. తమిళంలో భారతీరాజా తీసిన ఒక సినిమా బాగానే ఆడింది. దాని రైట్స్ నిర్మాత ఎస్.గోపాల్‌రెడ్డి కొన్నారు. కాని దర్శకుడు కోడి రామకృష్ణ దానిని యథాతథంగా తీస్తే ఫ్లాప్ అవుతుందని భావించి కథలో మార్పులు, యాస, స్థానికత మార్చారు. అదే ‘మంగమ్మ గారి మనవడు’. సూపర్‌హిట్ అయ్యింది. మరో హిట్ ‘ముద్దుల మావయ్య’ కూడా రీమేక్. కాని తమిళ సినిమా ‘అరువదై నాల్’ ఆధారంగా తీసిన ‘మువ్వ గోపాలుడు’ పూర్తిగా కనెక్ట్ కాలేదు. రీమేక్‌లలో కొన్ని ఎందుకు కనెక్ట్ అవుతాయో కొన్ని ఎందుకు కావో చెప్పలేము. తమిళంలో విసు తీసిన ‘అవళ్ సుమంళిదాన్’ సినిమాను రవిరాజా పినిశెట్టి ‘పుణ్యస్త్రీ’ పేరుతో మార్పుచేర్పులు చేసి సూపర్‌హిట్ చేశారు. రవిరాజా పినిశెట్టి ఇచ్చిన భారీ రీమేక్‌లలో ‘చంటి’, ‘పెదరాయుడు’ ఉన్నాయి. ఆ తర్వాతి కాలంలో భీమినేని శ్రీనివాసరావు ఈ పల్స్ పట్టుకున్న డైరెక్టర్‌గా పేరు పొందారు. గ్యారంటీ కథలు సినిమా కోట్ల రూపాయల వ్యవహారం. కథ విన్నప్పుడు అది తెర మీద ఎలా వస్తుందో ఎలా హిట్ అవుతుందో ఎవరూ ఊహించలేరు. విన్నప్పటి కథ చూసినప్పుడు తేలిపోయి భారీ ఫ్లాప్ కావచ్చు. అందుకే హీరోలు రీమేక్‌ల వైపు అప్పుడప్పుడు చూస్తుంటారు. ఎందుకంటే ఒక భాషలో హిట్ అయిన కథ మరో భాషలో హిట్ అవుతుందన్న ఒక గ్యారంటీతో. పైగా ఆ కథకు ఎంత ఖర్చు అవుతుందో, ఎన్ని రోజులు పడుతుందో కూడా తెలిసిపోతుంది. నాగార్జున ‘విక్రమ్’ (హిందీ ‘హీరో’) తో తెరంగేట్రం చేసినా వెంకటేశ్ కాలక్రమంలో రీమేక్‌ల మీదే పూర్తిగా దృష్టి పెట్టినా ఇదే కారణం. ఒక్కోసారి టాప్ హీరోలకు కూడా రీమేక్‌ల అవసరం ఏర్పడుతుంది. చిరంజీవికి ‘పసివాడి ప్రాణం’, ‘హిట్లర్’, ‘ఠాగూర్’, ‘ఖైదీ నంబర్ 150’ పెద్ద సక్సెస్ ఇచ్చాయి. ఇవి నాలుగూ రీమేకులే. ఇప్పుడు ఆయన మలయాళం హిట్ ‘లూసిఫర్’లో నటిస్తున్నారు. మోహన్‌బాబుకు మలయాళం నుంచి రీమేక్ చేసిన ‘అల్లుడు గారు’ బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అయ్యింది. బి.గోపాల్ దర్శకుడిగా తీసిన ‘అసెంబ్లీ రౌడీ’ రీమేక్ ఆయనను కలెక్షన్ కింగ్‌ను చేసింది. కాని అదే బి.గోపాల్ వెంకటేశ్ హీరోగా చేసిన ‘చినరాయుడు’ రీమేక్ విఫలం అయ్యింది. ఆ సినిమాలోని తమిళదనం తెలుగుకు పడలేదు. తర్వాతి కాలంలో రాజశేఖర్ రీమేక్‌లకు కేరాఫ్‌గా మారాడు. అనూహ్య ఫలితాలు కచ్చితంగా హిట్ అవుతుందని రీమేక్ చేస్తే అనూహ్య ఫలితాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. తమిళంలో సూపర్‌డూపర్ హిట్ అయిన ‘వాల్టర్ వెట్రివల్’ను చిరంజీవి, శ్రీదేవితో ‘ఎస్పి పరశురామ్’గా రీమేక్ చేస్తే భారీ పరాజయం నమోదు చేసింది. అలాగే హిందీలో భారీ హిట్ అయిన ‘లగేరహో మున్నాభాయ్’ తెలుగు రీమేక్ ‘శంకర్‌దాదా జిందాబాద్’ కనెక్ట్ కాలేదు. వెంకటేశ్ ‘జెమిని’ నిరాశ పరిచింది. నాగార్జున ‘చంద్రలేఖ’ అంతే. ‘బాజీగర్’ రీమేక్‌గా తీసిన రాజశేఖర్ ‘వేటగాడు’ పరాజయం పొందింది. తమిళంలో భారీ హిట్ అయిన ‘ఆటోగ్రాఫ్’ను రవితేజాతో ‘నా ఆటోగ్రాఫ్’ తీస్తే ప్రేక్షకులు తిరస్కరించారు. ఈ మధ్యకాలంలో తమిళం నుంచి రీమేక్ చేసిన వరుణ్ సందేశ్ ‘కుర్రాడు’, మనోజ్ మంచు ‘రాజూ భాయ్’, బెల్లంకొండ శ్రీనివాస్ ‘స్పీడున్నోడు’, సందీప్‌కిషన్ ‘రన్’, పవన్ కల్యాణ్ ‘కాటమరాయుడు’, విష్ణు మంచు ‘డైనమైట్’, అల్లరి నరేశ్ ‘సిల్లీ ఫెలోస్’ అంతగా మెచ్చుకోలు పొందలేదు. తమిళ ‘96’ తెలుగులో ‘జాను’గా వస్తే బాగుందని పేరు వచ్చినా జనం చూడలేదు. అందుకే రీమేక్‌లో తెలియని రిస్క్ ఉంటుందని అంటారు. కొనసాగుతున్న రీమేక్స్ అయినా సరే రీమేక్స్ కొనసాగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న ‘నారప్ప’ వచ్చింది. తాజాగా ‘మాస్ట్రో’ వచ్చింది. ‘ఉమామహ్వేర ఉగ్రరూపస్య’, ‘కపటధారి’, ‘తిమ్మరుసు’, ‘రాక్షసుడు’, ‘గద్దలకొండ గణేశ్’, ‘వకీల్‌సాబ్’... ఇవన్నీ రీమేక్స్ పట్ల ఆసక్తిని నిలిపి ఉంచాయి. మలయాళంలో హిట్ అయిన ‘లూసిఫర్’, ‘అయ్యప్పనమ్ కోషియం’ రీమేక్ అవుతున్నాయి. మరాఠిలో నానా పటేకర్ నటించగా పెద్ద హిట్ అయిన ‘నటసామ్రాట్’ తెలుగులో ప్రకాష్‌రాజ్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో తయారవుతోంది. ‘దృశ్యం 2’ రానుంది. గోడకు బంగారు చేర్పు అవసరం. ఇక్కడ గోడ కథ. గోడ గట్టిగా ఉంటే బంగారానికి దాని మీద వాలే శక్తి పెరుగుతుంది. కథను బాగా రాయడం తెలిస్తే రీమేక్‌ల అవసరం ఉండదు. తెలుగులో గట్టి సినీ కథకులు ఉన్నారు. తెలుగు సినిమాలు పరాయి భాషలో రీమేక్ అవుతున్నాయి. మన రంగంలో ఇతరులకు కథలిచ్చేలా ఎక్కువగా, కథలు తీసుకునేలా తక్కువగా ఉండాలని కోరుకుందాం. ‘ -
హిట్ రిపీట్ అవుతుందా?
ఓ భాషలో ఏదైనా సినిమా విజయం సాధిస్తే, రీమేక్ ద్వారా తమ భాషలోకి తీసుకురావాలనుకుంటారు దర్శక–నిర్మాతలు. ఈజీ హిట్ ఫార్ములా అనేది ఒక కారణం. మంచి కథను మరో ప్రాంతం ఆడియన్స్‌కు చూపించాలనేది ఇంకో కారణం. హిట్ సినిమా రీమేక్ కూడా హిట్టే అవుతుందా? అంటే చెప్పలేం. చాలా లెక్కలుంటాయి. ఆ లెక్కలన్నీ సరిగ్గా లెక్క కట్టాలి. ఆ మంత్రం మళ్లీ సరిగ్గా జపించాలి. అప్పుడే మ్యాజిక్ జరుగుతుంది. ప్రస్తుతం ఓ భాషలో తయారైన అయిదు సూపర్ హిట్ సినిమాలు ఏకకాలంలో మూడు భాషల్లో రీమేక్ అవుతున్నాయి. ఆ సినిమాలు – ఆ రీమేక్‌ల విశేషాలు. అయ్యప్పనుమ్ కోషియుమ్ పృథ్వీరాజ్, బిజూ మీనన్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’. ఇద్దరు వ్యక్తుల ఈగోకి సంబంధించిన కథాంశంగా ఈ సినిమా తెరకెక్కింది. సచీ దర్శకత్వం వహించారు. మలయాళంలో ఘనవిజయం సాధించింది ఈ సినిమా. ప్రస్తుతం ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రీమేక్ అవుతోంది. ► తెలుగు రీమేక్‌లో పవన్ కల్యాణ్, రానా హీరోలుగా నటిస్తున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు–స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. నాగవంశీ నిర్మాత. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. ► హిందీ రీమేక్‌లో ‘దోస్తానా’ కాంబినేషన్ జాన్ అబ్రహామ్, అభిషేక్ బచ్చన్ నటించనున్నారు. నటించడంతో పాటు జాన్ అబ్రహామ్ ఈ సినిమాను నిర్మించనున్నారు కూడా. జూన్ లో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారనేది ఇంకా ప్రకటించలేదు. ► ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తమిళ రీమేక్‌లో కార్తీ, పార్తిబన్ నటిస్తారని వార్తలు వచ్చాయి. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. హెలెన్ రెస్టారెంట్‌లోని ఫ్రీజర్‌లో చిక్కుకుపోయిన అమ్మాయి అందులో నుంచి ఎలా బయటపడింది? అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మలయాళ థ్రిల్లర్ చిత్రం ‘హెలెన్ ’. అన్నా బెన్ ముఖ్య పాత్ర చేసిన ఈ సినిమాని మతుకుట్టి జేవియర్ డైరెక్ట్ చేశారు. 2019లో ఈ సినిమా విడుదలైంది. తాజాగా ‘హెలెన్ ’ చిత్రాన్ని హిందీ, తమిళం, తెలుగు భాషల్లో రీమేక్ చేస్తున్నారు. ► అన్నా బెన్ చేసిన పాత్రను తెలుగు రీమేక్‌లో అనుపమా పరమేశ్వరన్ చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ► ‘హెలెన్ ’ తమిళ రీమేక్‌ను ‘అన్బిర్కినియాళ్’ టైటిల్‌తో తెరకెక్కించారు. కీర్తీ పాండియన్ లీడ్ రోల్ చేస్తున్నారు. గోకుల్ దర్శకుడు. చిత్రీకరణ పూర్తయింది. ► ‘హెలెన్ ’ హిందీ రీమేక్‌లో జాన్వీ కపూర్ నటించనున్నారు. దర్శకుడు, మిగతా వివరాలు ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. దృశ్యం 2 మోహన్ లాల్, మీనా జంటగా జీతూ జోసెఫ్ తెరకెక్కించిన థ్రిల్లర్ చిత్రం ‘దృశ్యం’. 2013లో విడుదలైన ఈ సినిమా పెద్ద హిట్. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ (దృశ్యం 2) విడుదలయింది. మొదటి భాగంలో పని చేసిన టీమే ఈ సీక్వెల్ తెరకెక్కించారు. ‘దృశ్యం 2’ చిత్రం ప్రస్తుతం తెలుగులో, తమిళంలో రీమేక్ కాబోతోంది. హిందీలోనూ రీమేక్ కానుందని టాక్. ► ‘దృశ్యం’ మొదటి భాగంలో వెంకటేశ్, మీనా జంటగా నటించారు. సీక్వెల్లోనూ వీరే నటించనున్నారు. మార్చి మొదటి వారం నుంచి ఈ రీమేక్ సెట్స్ మీదకు వెళ్లనుంది. జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేస్తారు. ► ‘దృశ్యం’ తమిళ రీమేక్ జీతూ జోసెఫ్, కమల్‌హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కింది. తాజాగా ఈ సీక్వెల్‌ను కేయస్ రవికుమార్ డైరెక్ట్ చేయనున్నారని వార్తలు వచ్చాయి. కమల్‌హాసన్ ప్రస్తుతం పొలిటికల్‌గా బిజీగా ఉన్నారు. మరి ఈ సీక్వెల్లో ఆయనే నటిస్తారా? వేరెవరైనా సీన్ లోకి వస్తారేమో చూడాలి. ► ‘దృశ్యం’ హిందీ రీమేక్‌లో అజయ్ దేవగణ్, శ్రియ నటించారు. తాజా సీక్వెల్ హిందీలోనూ రీమేక్ అవుతుందని బాలీవుడ్ టాక్. ఓ మై కడవుళే అశోక్ సెల్వన్, రితికా సింగ్ జంటగా అశ్విన్ మారిముత్తు తెరకెక్కించిన తమిళ చిత్రం ‘ఓ మై కడవుళే’. జీవితంలో రెండో అవకాశం లభించినప్పుడు ఏం చేయొచ్చు అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమా ఇది. ఇందులో విజయ్ సేతుపతి అతిథి పాత్రలో నటించారు. 2020లో విడుదలైన ఈ సినిమా మంచి హిట్ అయింది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. ► తమిళ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన అశ్విన్ తెలుగు రీమేక్‌ను కూడా డైరెక్ట్ చేయనున్నారు. విశ్వక్ సేన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తారు. పీవీపీ బ్యానర్ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుంది. ► హిందీ రీమేక్ హక్కులను ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ దక్కించుకుంది. అశ్విన్ మారిముత్తునే ఈ హిందీ వెర్షన్ ను కూడా డైరెక్ట్ చేస్తారు. ► ‘ఓ మై కడవుళే’ కన్నడ వెర్షన్ లో డార్లింగ్ కృష్ణ హీరోగా నటిస్తున్నారు. అతిథి పాత్రలో కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ కనిపిస్తారు. అంధా ధున్ ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, టబు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన హిందీ చిత్రం ‘అంధా ధున్ ’. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పెద్ద హిట్. జాతీయ అవార్డు కూడా సాధించింది. ఇప్పుడు ‘అంధా ధున్ ’ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రీమేక్ కానుంది. ► తెలుగు రీమేక్‌లో నితిన్ హీరోగా నటిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకుడు. రాధికా ఆప్టే పాత్రలో నభా నటేశ్, టబు పాత్రలో తమన్నా కనిపించనున్నారు. జూన్ 11న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ► తమిళ రీమేక్‌లో ‘జీన్స్’ ఫేమ్ ప్రశాంత్ నటిస్తున్నారు. జేజే ఫ్రెడ్రిక్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. టబు చేసిన పాత్రను సిమ్రాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘అంధగన్ ’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ► ‘అంధా ధున్ ’ మలయాళ రీమేక్‌ని ‘భ్రమం’ అనే టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. పృధ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటిస్తున్నారు. రాశీ ఖన్నా కథానాయిక. ఆయా భాషల్లో విజయం సాధించినట్టు ఈ రీమేక్స్ కూడా విజయం సాధిస్తాయా? ఒరిజినల్లో జరిగిన మ్యాజిక్‌ను రీమేక్‌లోనూ ఆయా చిత్రబృందాలు క్రియేట్ చేయగలుగుతాయా? వెయిట్ అండ్ సీ! -
నితిన్ అంధుడిగా కనిపించేది అప్పుడే!
బాలీవుడ్లో సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న చిత్రం 'అంధాధున్'. తెలుగులో నితిన్ హీరోగా ఈ సినిమా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ రీమేక్ బాధ్యతను తన భుజానెత్తుకున్నాడు. తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. జూన్ 11న థియేటర్లలో సందడి చేయనున్నట్లు వెల్లడించారు. నితిన్ అంధుడిగా, సంగీతకారుడిగా కనిపించనున్న ఈ సినిమాలో హీరోయిన్ నభా నటేశ్ అతడితో జోడీ కడుతోంది. నెగెటివ్ షేడ్స్ ఉన్న టబు పాత్రలో మిల్కీ బ్యూటీ తమన్నా కనిపించనుంది. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి నిర్మిస్తున్నారు. హరి కె. వేదాంత్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. JUNE 11th is the Date!! #Nithiin30 @tamannaahspeaks @NabhaNatesh @GandhiMerlapaka @SreshthMovies_ pic.twitter.com/jTGdMRLslA — nithiin (@actor_nithiin) February 19, 2021 అంధుడైన హీరో ఓ హత్యకు ఎలా సాక్షిగా మారతాడనేది ఈ చిత్ర ప్రధాన కథ. బాలీవుడ్లో ఈ సినిమా ఆయుష్మాన్ ఖురానాకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది. మరి నితిన్‌కు ఈ సినిమా ఎన్ని ఫలాలనిస్తుందో వేచి చూడాలి. ఇప్పటికే అతడు దేశదద్రోహిగా నటించిన 'చెక్' ఫిబ్రవరి 26న విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు 'రంగ్‌దే' మార్చి 26న ప్రేక్షకులను పలకరించనుంది. ఆ తర్వాత రెండు నెలల గ్యాప్ తీసుకుని 'అంధాధున్' రీమేక్‌తో అభిమానులను అలరించేందుకు రానున్నాడు. చదవండి: 15 నిమిషాల కథ విని ఒప్పుకున్నా: నితిన్ ముంబైలో ఇళ్లు కొన్న బుట్టబొమ్మ -
కనబడుట లేదు.. భారీ హిట్‌కి గురి
అవును... మన స్టార్స్‌కి కనబడట్లేదు. కథలో దమ్ము కనిపించేసరికి స్క్రీన్ మీద తమ పాత్రకు కళ్లు కనిపించకపోయినా ఫర్వాలేదంటున్నారు. క్యారెక్టర్‌కి కొత్త షేడ్ వస్తుందంటే.. సినిమా మొత్తం షేడ్స్ (కళ్ల జోడు) పెట్టుకొనే ఉండటానికి రెడీ అంటున్నారు. స్క్రీన్‌పై అంధులుగా నటిస్తూ.. బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్‌కి గురి పెట్టారు. అంధ పాత్రలను ఓ చూపు చూస్తున్నారు. ప్రస్తుతం అంధ పాత్రలో నటిస్తున్న స్టార్స్‌పై ఓ లుక్కేద్దాం.. ‘అంధా ధున్’ హిందీలో పెద్ద హిట్. ఈ సినిమా ఇప్పుడు తెలుగు, తమిళంలో రీమేక్ అవుతోంది. తెలుగు రీమేక్‌లో నితిన్ హీరోగా నటిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే దుబాయ్‌లో ప్రారంభం అయింది. ఇందులో నితిన్ అంధ పియానో ప్లేయర్ పాత్రలో కనిపిస్తారు. తమిళ రీమేక్ విషయానికి వస్తే.. ప్రశాంత్ లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్‌ను జనవరి 1న ప్రకటిస్తున్నట్టు చిత్రబృందం పేర్కొంది. జేజే ఫ్రెడ్రిక్ దర్శకుడు. ఈ సినిమాలో పియానో వాద్యకారుడిగా నటించడానికి లాక్డౌన్లో రోజుకి రెండు గంటల చొప్పున పియానో నేర్చుకున్నారట ప్రశాంత్. ‘అంధా ధున్’ మలయాళంలోనూ రీమేక్ కాబోతుందనే వార్త కూడా ఉంది. మలయాళ హీరో పృథ్వీరాజ్ లీడ్ రోల్ చేస్తారట. లేడీ సూపర్‌స్టార్ నయనతార కొత్త సినిమా కోసం అంధురాలిగా మారారు. మిలింద్ రాజు తెరకెక్కిస్తున్న ‘నెట్రిక్కన్’లో కళ్లు కనిపించని అమ్మాయిగా చేస్తున్నారు నయన. ‘నెట్రిక్కన్’ అంటే మూడో కన్ను అని అర్థం. ఈ సినిమాలో నగరంలో వరుసగా అమ్మాయిలు కనిపించకుండా పోతుంటారు. ఈసారి నయనతార వంతు వస్తుంది. మరి ఆ చిక్కుల్లో నుంచి చూపులేకున్నా ఈ అమ్మాయి ఎలా తప్పించుకుందన్నది కథ. కమల్ హాసన్ సూపర్‌హిట్ సినిమాల్లో ‘రాజపార్వై’ (తెలుగులో ‘అమావాస్య చంద్రుడు’) ఒకటి. అందులో కమల్ అంధుడిగా నటించారు. ఇప్పుడు అదే టైటిల్‌తో వరలక్ష్మి ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో వరలక్ష్మి కూడా అంధురాలిగా నటిస్తున్నారు. హిందీ వైపు వెళ్తే... క్రైమ్‌ని కనిపెట్టడానికి కళ్లు అంత ముఖ్యమా? కామన్సెన్స్ చాలు అంటున్నారు సోనమ్ కపూర్. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘బ్లైండ్’. ఈ చిత్రంలో ఓ సైకో కిల్లర్‌ను పట్టుకునే కళ్లు కనిపించని పోలీసాఫీసర్‌గా సోనమ్ నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ సోమవారం స్కాట్‌ల్యాండ్‌లో ప్రారంభం అయింది. ఈ చూపులేని పాత్రల్లో తారలందరూ ఆడియన్స్ చూపు తిప్పుకోలేని పర్ఫార్మెన్స్ ఇచ్చి, అలరిస్తారని ఊహించవచ్చు. -
కొత్త అవతారం
సిమ్రాన్ ఫుల్ ఎగ్జయిట్‌మెంట్‌తో ఉన్నారు. కథానాయికగా తన కెరీర్లో ఎన్నో సూపర్హిట్లు అందుకున్న సిమ్రాన్ ఇప్పుడు ఎగ్జయిట్ అవ్వడానికి కారణం ఉంది. బాలీవుడ్ సూపర్‌హిట్ ఫిల్మ్ ‘అంధా ధున్’ తమిళ రీమేక్‌లో ఆమె నటించనున్నారు. ఆ సినిమాలో తబు చేసిన బోల్డ్ క్యారెక్టర్ని సిమ్రాన్ చేయనున్నారు. ఈ సందర్భంగా సిమ్రాన్ మాట్లాడుతూ – ‘‘తబు చేసిన పాత్రను నేను చేయటం పెద్ద బాధ్యతగా అనుకుంటున్నాను. ఈ బోల్డ్ క్యారెక్టర్‌ను ఎంత ఛాలెంజింగ్‌గా చేస్తానో చూడాలి. ఓ కొత్త అవతారంలో కనిపించనున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘అంధా ధున్’ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా పోషించిన పాత్రను ‘జీన్స్’ ఫేమ్ ప్రశాంత్ చేస్తున్నారు. తెలుగు రీమేక్‌లో నితిన్ చేస్తున్న విషయం తెలిసిందే. -
కురుడన్ ట్యూన్!
ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, టబు ముఖ్య పాత్రల్లో శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కించిన థ్రిల్లర్ చిత్రం ‘అంధా ధున్’. హిందీలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. తెలుగులో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ హీరోగా ఈ సినిమా రీమేక్ అవుతోంది. తమిళ రీమేక్‌లో ప్రశాంత్ హీరోగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా మలయాళంలోనూ రీమేక్ కాబోతోందని తెలిసింది. ఈ మలయాళ రీమేక్‌లో ఆయుష్మాన్ పాత్రను పృథ్వీరాజ్ చేయనున్నారట. ఆయుష్మాన్ సినిమాలో అంధుడిగా నటించారు. అంధుడు అంటే మలయాళంలో కురుడన్. ‘అంధా ధున్’ అంటే ‘బ్లైండ్ ట్యూన్’ అని అర్థం. సో.. మలయాళంలో ‘కురుడన్ ట్యూన్’ అన్నమాట. ఇక హిందీలో టబు పోషించిన పాత్రలో మమతా మోహన్‌దాస్ కనిపిస్తారని సమాచారం. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ చిత్రానికి డైరెక్టర్ ఎవరనేది ఇంకా ప్రకటించలేదు. -
ఆమె అన్ని పాత్రలకి సూ‘టబు’ల్..
సౌత్ నుంచి బాలీవుడ్‌కు వెళ్లి స్టార్స్ అయిన వారిలో చాలా మంది ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీ నుంచి ముంబైలో జెండా పాతినవారిలో శ్రీదేవి, జయప్రద మొదటి వరుసలో వస్తారు. కాని అంతే స్టార్‌డమ్‌ను, రెస్పెక్ట్ను సృష్టించుకున్న ఇంకో హీరోయిన్ను మన సౌత్ ఖాతాలో ఎవరూ వేయరు. ఆమె టబూ.. అసలు సిసలు తెలుగు అమ్మాయి. అందులోనూ హైదరాబాదీ అమ్మాయి. టబు బాలీవుడ్లో తన టాలెంట్‌ను చూపారు. ఇటు సౌత్‌లో అటు నార్త్‌లో ఒక వర్సటైల్ ఆర్టిస్ట్‌గా ప్రూవ్ చేసుకున్నారు. ఇవాళ తన బర్త్‌డే. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని విశేషాలు.. అసలు పేరు తబస్సుమ్... టబు అని అందరూ పిలుస్తారు గాని ఆమె అసలు పేరు తబస్సుమ్. పిలిస్తే తబు అని పిలవాలి. కాని టబు అని అలవాటైంది. ఆమె మదర్, ప్రసిద్ధ బాలీవుడ్ నటి షబానా ఆజ్మీ మదర్ దగ్గరి బంధువులు. షబానా ఆజ్మీకి టబూ మేనకోడలి వరుస. టెన్త్ వరకూ హైదరాబాద్‌లో చదువుకున్న టబు ఇంటర్ నుంచి చదువు కోసం ముంబై వెళ్లింది. షబానా ఆజ్మీ వల్ల సినిమా వాతావరణం ఉండటంతో ముందు టబు అక్క పర్హా ఖాన్ హీరోయిన్ అయ్యారు. ఆ తర్వాత టబు కూడా సినిమా రంగ ప్రవేశం చేసింది. షబానా ఇంట్లో టబును చూసిన ప్రసిద్ధ నటుడు దేవ్ ఆనంద్ ఆమెకు హమ్ నౌజవాన్ అనే సినిమాలో అవకాశం ఇచ్చారు. కాని కొత్త హీరోయిన్లను ఇంట్రడ్యూస్ చేయడానికి రెడీగా ఉండే మన నిర్మాత రామానాయుడు టబును కూలీ నంబర్ ఒన్ సినిమాతో తెలుగులోకి తీసుకు వచ్చారు. ఆ సినిమా సూపర్‌హిట్. టబు కూడా సూపర్ హిట్. బాలీవుడ్లో కూడా విజయపథమే.. కూలీ నంబర్ ఒన్ తర్వాత టబు రేంజ్ పెరిగిపోయింది. అందరు హీరోలకు అందుబాటులో లేనంత స్థాయికి వెళ్లింది. ఆ టైమ్‌లోనే హిందీలో అజయ్ దేవ్‌గణ్‌తో చేసిన విజయ్‌పథ్ కూడా సూపర్ హిట్ అయ్యింది. అజయ్ దేవగణ్ ముంబైకు వచ్చినప్పటి నుంచి టబుకు క్లోజ్ ఫ్రెండ్. వాళ్లు ముంబైలో ఇరుగు పొరుగు ఉండేవారు. ఆ పరిచయం వల్లే విజయపథ్లో కలిసి నటించారు. హిట్ కొట్టారు. (చదవండి: మళ్లీ జంటగా...) టబు-నాగ్ల స్నేహానికి నాంది.. ఈ లోపు తెలుగులో మాస్టర్ అఖిల్ హీరోగా సిసింద్రీ మొదలయ్యింది. నాగార్జున సొంత సినిమా కావడం వల్ల ఇందులో స్పెషల్ సాంగ్‌లో నటించింది టబు. నాగార్జున టబుల సుదీర్ఘ స్నేహానికి ఈ సినిమా మొదటి మెట్టుగా నిలిచింది. పండు అలియాస్ మహాలక్ష్మి.. కాని అసలు సిసలు మాయాజాలం, టబూజాలం తెలియజేసిన సినిమా నిన్నే పెళ్లాడుతా. హిందీలో కొత్త ఫ్యామిలీ స్టోరీ ట్రెండ్‌ను తీసుకొచ్చిన హమ్ ఆప్ కే హై కౌన్ స్ఫూర్తితో రాసుకున్న ఈ కథలో మహాలక్ష్మి అలియాస్ పండుగా టబు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. నాగార్జునను గ్రీకువీరుడిగా మోహించే అందాలరాశిగా ఆకర్షించారు. (చదవండి: ముచ్చటగా మూడోసారి) ప్రేమదేశంతో సౌత్‌లో టాప్ కాని అదే సమయంలో దర్శకుడు కదిర్ తమిళంలో తీసిన కాదల్ దేశం టబును మొత్తం సౌత్‌కు పరిచయం చేసింది. ఆ సినిమా తెలుగులో ప్రేమదేశం పేరుతో విడుదలయ్యి సంచలన విజయం సాధించింది. టబులోని గ్రేస్ ఈ సినిమాలో కుర్రకారు వెర్రెత్తి చూశారు. మేచిస్, అస్తిత్వతో మరో మెట్టు పైకి.. కాని టబు అంటే ఇలాంటి కేరెక్టర్లేనా? ఆమెలో నటిగా టాలెంట్ లేదా? ఉంది అని కనిపెట్టినవాడు దర్శకుడు గుల్జార్. అతడు తీసిన హిందీ సినిమా మేచిస్ టబులోని కొత్త నటిని లోకానికి వెల్లడి చేశారు. ఆమెను దృష్టిలో పెట్టుకుని మంచి కథలు రాయవచ్చని ఆ సినిమా రుజువు చేసింది. ఉగ్రవాదం నేపథ్యంలో నలిగే ఒక అమ్మాయి పాత్రలో టబు అద్భుత నటన ప్రదర్శించి ఎన్నో అవార్డులు ఎన్నో గెలుచుకున్నారు. ఆ తర్వాత నటుడు, దర్శకుడు సంజయ్ మంజ్రేకర్ తీసిన అస్తిత్వ సినిమా టబును నటనను మరో స్థాయికి తీసుకెళ్లారు. భర్త ఉండగా మరో పురుషుడితో సంబంధంలోకి వెళ్లే గృహిణి పాత్రలో టబు ఈ సినిమాలో నటించారు. స్త్రీల మానసిక ప్రపంచం గురించి భావోద్వేగాల గురించి ఈ సినిమాలో టబు చేసిన స్టేట్మెంట్ ఆ సమయంలో గొప్ప ఫెమినిస్టిక్ స్టేట్మెంట్గా విమర్శకులు వ్యాఖ్యానించారు. ఉత్తమ నటిగా నిలబెట్టిన చాందిని బార్ ఆ తర్వాత ఫైనల్ టచ్‌గా మధుర్ భండార్కర్ తీసిన చాందిని బార్ టబును జాతీయ ఉత్తమ నటిగా నిలబెట్టింది. ముంబైలో పని చేసే బార్ డాన్సర్ల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా అటు ప్రేక్షకుల ఇటు విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆ తర్వాత టబు గొప్ప కథలకు ఒక ముఖ్యమైన ఎంపికగా నిలిచింది. హిందీలో సీరియస్ సినిమాలు చేస్తూనే తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున పక్కన సినిమాలలో నటించింది టబు. చిరంజీవితో అందరివాడులో ఆమె చేసిన పాట ఎవరు మర్చిపోతారు. (చదవండి: హార్ట్ బీట్‌ని ఆపగలరు!) అంధాదున్కి క్రిటిక్స్ కితాబు.. టబు ఇటీవల బాలీవుడ్లో అంధాధున్ సినిమాలో కీలకమైన పాత్ర చేసి బాలీవుడ్‌ను మరోసారి సర్ప్రైజ్ చేశారు. ఆమె చేయడం వల్లే ఆ క్యారెక్టర్ చాలా బాగా వచ్చిందని క్రిటిక్స్ కితాబు. మొన్నటి అల వైకుంఠపురములో టబు తాజా తెలుగు సినిమా. ఇక టబు పర్సనల్ లైఫ్‌లోకి వస్తే తను సింగిల్ ఉమన్‌గా ఉన్నారు. ఇంకా వివాహ బంధంలోకి వెళ్లలేదు. ఖాళీ దొరికితే సోలో ట్రావెలర్‌గా దేశాలు తిరగడం ఆమెకు ఇష్టం. గొప్ప నటిగా గొప్ప సినిమాలు మరెన్ని చేస్తూ తను హ్యాపీగా ఉంటూ మనల్ని హ్యాపీగా ఉంచాలని కోరుకుందాం. హ్యాపీ బర్త్ డే టుయూ వన్స్ అగైన్ టబు. -
ఈ రీమేక్‌లో టబు పాత్రలో ఐశ్వర్య.. కానీ!
బాలీవుడ్ సూపర్ హిట్ థ్రిల్లర్ చిత్రం ‘అంధధూన్’ తమిళ రీమేక్‌లో మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ బచ్చన్ కీలక పాత్రలో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్లో అయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నట్లు సినీయర్ హీరో ప్రశాంత్ తండ్రి, నిర్మాత తియగరాజన్ తెలిపారు. ఈ రీమేక్‌లో ప్రధాన పాత్రలో ప్రశాంత్ నటిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే బాలీవుడ్లో బ్లక్‌బస్టర్‌గా నిలిచిన ‘అంధధూన్’లో టబు కీలక పాత్ర పోషించారు. దీంతో తమిళ రిమేక్‌కు టబు పాత్రకు గాను ఐశ్వర్యరాయ్‌ను సంప్రదించినట్లు నిర్మాత తియగరాజన్ చెప్పారు. ఆయన ఓ జాతీయా మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో టబు పాత్ర కోసం ఐశ్వర్యరాయ్‌తో చర్చలు జరుపుతున్నాం. అయితే ఇప్పటి వరకు తన నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఒకవేళ తను ఓకే చెబితే మాత్రం దాదాపు 22 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రశాంత్, ఐశ్వర్యలు కలిసి పని చేస్తారు’ అంటూ చెప్పకోచ్చారు. (చదవండి: నితిన్ రీమేక్ మూవీ: డైరెక్టర్..) 1998లో ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘జీన్స్’ సినిమాలో ప్రశాంత్, ఐశ్వర్యలు హీరో, హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా బ్లక్‌బస్టర్‌గా నిలిచింది. ఇటీవల తెలుగులో వచ్చిన ‘వినయ విధేయ రామ’లో ప్రశాంత్ రామ్ చరణ్‌కు అన్నగా నటించిన విషయం తెలిసిందే. అయితే ‘అంధధూన్’ తమిళ రిమేక్‌లో మరో ముఖ్య పాత్రల కోసం ప్రముఖ నటుడు కార్తీక్, హాస్యనటుడు యోగిలను ఖరారు చేసినట్లు వార్తలు వచ్చినప్పటికి కార్తీక్ పాత్ర ఇంకా ఖరారు కాలేదు. ఈ సినిమా కోసం ప్రశాంత్ 23 కిలోల బరువు తగ్గినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ 2018లో ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో విడుదలైన ‘అంధధూన్’ చిత్రం బీ-టౌన్లో సూపర్ హిట్‌గా నిలిచింది. ఇందులో అంధుడిగా ఆయుష్మాన్ నటనకు విమర్శకు నుంచి ప్రశంసలు అందుకుంది. అంతేగాక తన పాత్రకు ఉత్తమ నటుడిగా కూడా ఎన్నికయ్యాడు. అలాగే తెలుగులో కూడా రీమేక్ కానున్న ‘అంధధూన్’లో హీరో నితిన్ నటిస్తున్నాడు. శ్రేష్ట్ మూవీస్ పతాకంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో తమన్నా, నభా నటేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. (చదవండి: 21 ఏళ్ల చిన్నవాడితో ప్రేమ.. అయితే ఏంటి?!) -
ఇస్మార్ట్ స్పీడ్
‘ఇస్మార్ట్ శంకర్’తో సూపర్ హిట్ కొట్టారు ఇస్మార్ట్ భామ నభా నటేశ్. ఇప్పుడు ఇస్మార్ట్ స్పీడ్‌లో షూటింగ్స్ చేస్తున్నారామె. లాక్డౌన్లో ఒక్కో సినిమా చిత్రీకరణ జరుగుతుంటే నభా నటేశ్ ఒక చిత్రాన్ని పూర్తి చేసి ఇంకో సినిమా పూర్తి చేసే పనిలో పడ్డారు. సాయి తేజ్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘సోలో బతుకే సో బెటర్’ సినిమాలో హీరోయిన్గా చేశారామె. ఇటీవలే ఆ సినిమా మిగిలిన భాగాన్ని పూర్తి చేశారు. అలాగే బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా చేస్తున్న ‘అల్లుడు అదుర్స్’లో హీరోయిన్గా చేస్తున్నారు. ప్రస్తుతం ఆ సినిమా చిత్రీకరణ వేగంగా జరుగుతోంది. ఇది కాకుండా ‘అంధాధూన్’ తెలుగు రీమేక్‌లో హీరోయిన్గా చేయనున్నారు. నవంబర్‌లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం అవుతుందని టాక్. -
క్రేజీ రీమేక్‌కి సై
నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. హిందీలో ఘన విజయం సాధించిన క్రేజీ చిత్రం ‘అంధాధూన్’కి ఇది తెలుగు రీమేక్. ‘ఠాగూర్’ మధు సమర్పణలో శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై ఎన్ . సుధాకర్‌రెడ్డి, నికితా రెడ్డి నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ నవంబర్‌లో ప్రారంభం కానుంది. ‘అంధాధూన్’లో టబు చేసిన నెగటివ్ షేడ్ ఉన్న పాత్రను తెలుగులో తమన్నా, రాధికా ఆప్టే పాత్రను నభా నటేష్ చేయనున్నారు. ‘అంధాధూ¯Œ ’లో టబు నటనకు ప్రశంసలు దక్కాయి. నెగటివ్ షేడ్స్ ఉన్న ఆ పాత్రను చేసే సవాలును స్వీకరించారు తమన్నా. ప్రతి పాత్రకూ ప్రాధాన్యం ఉండే ఈ చిత్రంలో నటించే అవకాశం లభించినందుకు నభా నటేష్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వరసాగర్, కెమెరా: హరి కె. వేదాంత్. -
కిలాడీ లేడీ ఎవరు?
హిందీలో ఘనవిజయం సాధించిన ‘అంధాధూన్’ తెలుగులో రీమేక్ కాబోతోందనే వార్తలు వచ్చినప్పటి నుండి ఒకటే ప్రశ్న – ‘హిందీలో టబు చేసిన పాత్ర ఎవరు చేస్తారు?’ అని. ఆయుష్మాన్ ఖురానా, టబు, రాధికా ఆప్టే ముఖ్య పాత్రల్లో శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన క్రైమ్ థ్రిల్లర్ ‘అంధాధూన్’. నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెలుగులో ఈ చిత్రాన్ని రీమేక్ చేయనున్నారు. నభా నటేష్ హీరోయిన్. నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట మూవీస్‌పై సుధాకర్ రెడ్డి నిర్మించనున్నారు. అయితే మొదటి నుంచి టబు పోషించిన పాత్రకు పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. ఈ పాత్రకు అంత స్పెషాలిటీ ఏంటీ అంటే? నెగటివ్ షేడ్స్ ఉండటమే. కథను మలుపు తిప్పే కిలాడీ పాత్ర కావడమే అందుకు ప్రధాన కారణం. మొదట టబూయే ఆ పాత్ర మళ్లీ చేస్తారు అనే వార్త వచ్చింది. తర్వాత నయనతార ఆ పాత్ర చేయబోతున్నారని ఓ వార్త. తాజాగా ఈ పాత్రకు ప్రియమణి లేదా శ్రియను తీసుకోవాలనుకుంటున్నారట చిత్రబృందం. మరి ఈ కిలాడీ లేడీ పాత్ర చేసే ఛాన్స్ ఎవరికొస్తుందో వేచి చూడాలి. -
నితిన్ @ 31
‘భీష్మ’ చిత్రం సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న హీరో నితిన్ నటిస్తోన్న 31వ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమయ్యింది. బాలీవుడ్లో మంచి విజయాన్ని అందుకున్న ‘అంధాధూన్’ చిత్రానికి ఇది రీమేక్. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై 6వ చిత్రంగా తీయబోతున్న ఈ చిత్రానికి ఎన్.సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మాతలు. ‘ఠాగూర్’ మధు సమర్పిస్తున్న ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రం ప్రారంభోత్సవంలో హారిక–హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్. రాధాకృష్ణ చిత్రబృందానికి స్క్రిప్ట్ అందించగా, ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత ‘దిల్’ రాజు కెమెరా స్విచ్చాన్ చేశారు. నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి క్లాప్‌నిచ్చారు. దర్శకుడు సురేందర్ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. జూన్ నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆరంభమవుతుంది. ఈ చిత్రానికి కెమెరా: హరి కె.వేదాంత్. -
నితిన్ రీమేక్ మూవీ: డైరెక్టర్..
భీష్మ సినిమా హిట్‌గా నిలవడంతో ఫుల్‌జోష్‌లో ఉన్న నితిన్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఈసారి స్ట్రేట్ సినిమాతో కాకుండా రీమేక్‌తో అభిమానులను అలరించనున్నాడు. బాలీవుడ్లో గత ఏడాది బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన చిత్రం ‘అంధాధూన్’.. విభిన్న కథాంశాలను ఎంచుకునే హీరో ఆయుష్మాన్ ఖురానా, టబు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా రీమేక్ హక్కులను నిర్మాత సుధాకర్ రెడ్డి సొంతం చేసుకున్నారు. ఇందులో ఆయన కుమారుడు నితిన్ హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే. Glad to announce our next production, a remake of #Andhadhun. Featuring @actor_nithiin and directed by @MerlapakaG. Glimpses from the official launch today! Bankrolled by #SudhakarReddy & #NikithaReddy. Presented by #BMadhu. More details soon!! #ProductionNo6 pic.twitter.com/rzpiARQl8J — Sreshth Movies (@SreshthMovies) February 24, 2020 ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించి శ్రేష్ఠ్ మూవీస్ తాజా అప్డేట్ను అభిమానులతో పంచుకుంది. నితిన్.. ‘అంధాధున్’ కు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు సినిమాను అధికారికంగా లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా వంటి సినిమాలతో మేర్లపాక గాంధీ హిట్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఇక అంధాధున్ సినిమా ఒరిజినల్లో నటించిన టబు రీమేక్‌లోనూ కనిపిస్తారా? వేచి చూడాలి. -
టబు పాత్రలో రమ్యకృష్ణ
హిందీలో ‘అంధాధూన్’ ఘనవిజయం సాధించింది. జాతీయ ఉత్తమ హిందీ చిత్రంగా నేషనల్ అవార్డు కూడా గెలుచుకుంది. ఇందులో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించారు. ఆయన నటనకు ప్రశంసలు దక్కాయి. అలాగే సినిమాకి కీలకంగా నిలిచిన టబు పాత్రకు, ఆమె నటనకు కూడా విపరీతమైన ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు ఆ పాత్రను తమిళంలో రమ్యకృష్ణ పోషించనున్నారని తెలిసింది. ‘అంధాధూన్’ తమిళ రీమేక్ హక్కులను నటుడు, దర్శకనిర్మాత త్యాగరాజన్ తీసుకున్నారు. ఇందులో ఆయన కుమారుడు, ‘జీన్స్’ ఫేమ్ ప్రశాంత్ హీరోగా నటించనున్నారు. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తారు. హిందీలో టబు చేసిన పాత్రకు నెగటివ్ షేడ్స్ ఉంటాయి. ఆ పాత్రకు రమ్యకృష్ణ అయితే బావుంటారని చిత్రబృందం భావించారట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ‘అంధాధూన్’ తెలుగు రీమేక్‌లో నితిన్ నటిస్తారు. -
రీమేక్‌కి రెడీ
బాలీవుడ్లో గత ఏడాది బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన చిత్రం ‘అంధాధూన్’. ఆయుష్మాన్ ఖురానా, టబు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తెలుగులో రీమేక్ కాబోతోంది. నిర్మాత సుధాకర్ రెడ్డి ఈ చిత్ర రీమేక్ హక్కులు తీసుకున్నారు. ఇందులో ఆయన కుమారుడు నితిన్ హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరనేది ప్రకటించలేదు. తాజాగా ఈ రీమేక్‌ను సుధీర్ వర్మ హ్యాండిల్ చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఒరిజినల్లో నటించిన టబు రీమేక్‌లోనూ కనిపిస్తారా? వేచి చూడాలి. -
అంధ పాత్రపై కన్నేశారా?
బాలీవుడ్ సూపర్‌హిట్ మూవీ ‘అంధాధూన్’ తెలుగు రీమేక్‌పై నాని కన్ను పడిందని ఇండస్ట్రీ టాక్. ‘అంధాధూన్’లో చూపు లేని పాత్ర చేసిన ఆయుష్మాన్ ఖురానాను అన్ని ఇండస్ట్రీలు తొంగి చూశాయి. ఆయుష్మాన్ పెర్ఫార్మెన్స్కు జాతీయ అవార్డు కూడా లభించింది. ఇప్పుడు ఈ చిత్రం తెలుగు రీమేక్‌లో హీరోగా నాని నటిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. హిందీ చిత్రాన్ని శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కించారు. మరి తెలుగు చిత్రాన్ని ఎవరు డైరెక్ట్ చేయనున్నారు అనే విషయం తెలియాల్సి ఉంది. -
ఆ బాలీవుడ్ రీమేక్‌పై నాని కన్ను
ప్రస్తుతం సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో రీమేక్‌ల ట్రెండ్ నడుస్తుంది. ఒక భాషలో ఘనవిజయం సాధించిన సినిమాలను ఇతర భాషల్లోకి రీమేక్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ లిస్ట్‌లో ఓ బాలీవుడ్ సూపర్‌హిట్ చేరనుంది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా హిందీలో ఘనవిజయం సాధించిన సినిమా అంధాధున్. ఈ సినిమాలో నటనకు గాను ఆయుష్మాన్ జాతీయ అవార్డును కూడా సాధించాడు. ఈ సినిమాను సౌత్‌లో రీమేక్ చేసేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు జరగుతున్నాయి. ఇప్పటికే తమిళ వర్షన్లో ప్రశాంత్ హీరోగా నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పుడు తెలుగు వర్షన్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించేందుకు నాని ఆసక్తిగా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే గ్యాంగ్ లీడర్ షూటింగ్ పూర్తి చేసిన నాని, ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నాని నెగెటివ్ రోల్లో కనిపించనున్నాడు. ఈ సినిమా తరువాత అంధాదున్ రీమేక్‌ను పట్టాలెక్కించాలని భావిస్తున్నాడు. -
ధనుష్ కాదు ప్రశాంత్!
శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, టబు ముఖ్య పాత్రల్లో నటించిన హిందీ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘అంధాధూన్’. ఈ చిత్రం తమిళంలో రీమేక్ కాబోతుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. హీరోగా ధనుష్, సిద్ధార్థ్ ఇలా పలువురు పేర్లు కూడా వినిపించాయి. ఓ సందర్భంలో ‘అంధాధూన్’ చేయాలని చాలా ఆసక్తిగా ఉన్నానని కూడా తెలిపారు ధనుష్. ఇప్పుడు ‘అంధాధూన్’ తమిళ రీమేక్‌లో ‘జీన్స్’ ఫేమ్ ప్రశాంత్ నటిస్తారని తెలిసింది. ఈ హిందీ చిత్రం తమిళ రైట్స్‌ను ప్రశాంత్ తండ్రి, నటుడు–దర్శకుడు–నిర్మాత త్యాగరాజన్ సొంతం చేసుకున్నారు. ప్రశాంత్ నటించిన గత చిత్రం ‘జానీ’ (తమిళం) కూడా శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కించిన ‘జానీ గద్దర్’ (హిందీ)కు రీమేకే కావడం విశేషం. -
సూపర్ హిట్ రీమేక్‌లో సునీల్!
ప్రస్తుతం సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో రీమేక్‌ల ట్రెండ్ నడుస్తుంది. ఒక భాషలో ఘనవిజయం సాధించిన సినిమాలను ఇతర భాషల్లోకి రీమేక్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ లిస్ట్‌లో ఓ బాలీవుడ్ సూపర్‌హిట్ చేరనుంది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా హిందీలో ఘనవిజయం సాధించిన సినిమా అంధాధున్. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ రీమేక్‌లో.. హీరోగా మారి సక్సెస్ కాలేక తిరిగి కమెడియన్‌గా నటిస్తున్న సునీల్ లీడ్ రోల్లో నటించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. హిందీలో హీరోది అంధుడి పాత్ర, మరి సునీల్ ఆ పాత్రకు ఎంత వరకు సూట్ అవుతాడు అన్నది చూడాలి. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా తమిళ రీమేక్‌లో నటించేందుకు ధనుష్, సిద్ధార్థ్ లాంటి హీరోలు ప్రయత్నిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. -
చూపు లేని పాత్రపై కన్ను
2018లో బాలీవుడ్లో సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రాల్లో శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కించిన ‘అంధాధూన్’ చిత్రం ఒకటి. ఆయుష్మాన్ ఖురానా అంధ పియానో ప్లేయర్ పాత్రలో కనిపించారు. ఇక్కడే కాదు, చైనాలోనూ ఈ సినిమా రికార్డ్ కలెక్షన్స్ నమోదు చేసింది. ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేసే ఆలోచన ఉందని ధనుష్ పేర్కొన్నారు. ‘‘2009 నుంచి రీమేక్ సినిమాల్లో నటించడం తగ్గించాను. కానీ ‘అంధాదూన్’ చాలా అద్భుతమైన సినిమా. ఆల్రెడీ ఈ రీమేక్ రైట్స్ తీసుకునే ప్రయత్నాల్లో మా టీమ్ ఉంది. ఇలాంటి అద్భుతమైన థ్రిల్లర్స్‌ను తమిళ ప్రేక్షకులకు తప్పకుండా చూపించాలనే ఉద్దేశంతోనే రీమేక్ చేయాలనుకున్నాను’’ అని పేర్కొన్నారు. హిందీ సినిమా చూసినవాళ్లకు ఇందులో హీరో చూపు లేనివాడు అనే విషయం తెలిసే ఉంటుంది. ధనుశ్లో మంచి నటుడు ఉన్నాడు. ఈ పాత్రను అద్భుతంగా చేయగలరని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. -
ఆమిర్ తర్వాత ఆయుష్!
‘పియానో ప్లేయర్’గా ఆయుష్మాన్ ఖురానా వాయించిన రాగానికి చైనీస్ సినీ జనం ఫిదా అయిపోయారు. కాసుల వర్షం కురిపిస్తున్నారు. కథలో కంటెంట్ ఉంటే స్టార్ కాస్టింగ్‌తో సంబంధం లేదని నిరూపించారు. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో టబు, ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే ముఖ్య తారలుగా రూపొందిన హిందీ చిత్రం ‘అంథా ధూన్’. గత ఏడాది అక్టోబరులో విడుదలైన ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఆ తర్వాత ఈ సినిమాను ‘పియానో ప్లేయర్’ టైటిల్‌తో చైనాలో రిలీజ్ చేశారు చిత్రబృందం. అక్కడ ఈ సినిమాకు విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా అక్కడ 300 కోట్ల రూపాయలను వసూలు చేసింది. చైనాలో అత్యధిక కలెక్షన్స్‌ను రాబట్టిన భారతీయ చిత్రాల్లో ‘అంథా ధూన్’ చిత్రానిది మూడో స్థానం కావడం విశేషం. బాలీవుడ్ మిస్టర్ పర్పెక్షనిస్ట్ అమీర్‌ఖాన్ నటించిన ‘దంగల్’ (2016), సీక్రెట్ సూపర్‌స్టార్ (2017) తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. అలాగే సల్మాన్‌ఖాన్ నటించిన ‘భజరంగీ భాయిజాన్’ (2015), ఇర్ఫాన్ ఖాన్ ‘హిందీ మీడియం’ (2017) చిత్రాలు 4, 5 స్థానాల్లో ఉన్నాయి. ఇలా పెద్ద హీరోల లిస్ట్ ఉన్న చైనీస్ మూవీ మార్కెట్లోకి కుర్రహీరో ఆయుష్మాన్ ఖురానా చేరడం అభినందనీయం. -
సిద్ధార్థ్‌తో నాలుగోసారి..
తమిళసినిమా: నటుడు సిద్ధార్థ్, త్రిషలది హిట్ కాంబినేషన్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ జంట కలిసి నటించడానికి సిద్ధం అవుతున్నారనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సిద్ధార్థ్ కోలీవుడ్‌లో నటించి చాలా కాలమవుతోంది. ఆయన సొంతంగా నిర్మించి, నటించిన ఆవళ్ చిత్రం తరువాత మరో చిత్రంలో నటించలేదు. అయితే తాజాగా శశి దర్శకత్వంలో జీవీ.ప్రకాశ్‌కుమార్‌తో కలిసి శివప్పు మంజల్ పచ్చై చిత్రంలో నటిస్తున్నారు. ఇక నటి త్రిష మార్కెట్ ఆ మధ్య తడబడ్డా 96 చిత్రంలో మళ్లీ సక్సెస్ గాడిలో పడింది. రజనీకాంత్‌తో నటించిన పేట హిట్ ఆమెకు మరింత జోష్‌ను తెచ్చి పెట్టింది. ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న త్రిష త్వరలో దర్శకుడు ఏఆర్.మురుగదాస్ కథ, కథనం అందించి సొంతంగా నిర్మించనున్న చిత్రంలో ప్రధాన పాత్రలో నటించబోతోందనే ప్రచారం జరుగుతోంది. దీనికి ఎంగేయుమ్ ఎప్పోదుమ్ చిత్రం ఫేమ్ శరవణన్ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. తాజాగా సిద్ధార్థ్‌తో కలిసి నటించడానికి సిద్ధం అవుతున్నట్లు టాక్. అంధధాన్ అనే హిందీ చిత్రం గత ఏడాది విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన ఇందులో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించారు. నటి రాధిక ఆప్టే హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో టబు ప్రధాన పాత్రలో నటించింది. అంధాదున్ చిత్రం ఇటీవల చైనాలో విడుదలై సుమారు రూ.200 కోట్లు వసూల్ చేసి రికార్డు సృష్టించింది. ఈ చిత్రం తమిళంలో రీమేక్ కానుందని, ఇందులో హీరోగా సిద్ధార్థ్ నటించనున్నట్లు ఇంతకు ముందే ప్రచారం జరిగింది. తాజాగా ఈ చిత్రంలో త్రిష నటించనుందనే ప్రచారం జరుగుతోంది. ఇదే నిజం అయితే ఈ జంట నాలుగోసారి రొమాన్స్ చేయడానికి సిద్ధం అవుతున్నారన్నమాట. ఇంతకు ముందు ఈ జంట ఆయుధ ఎళుత్తు, ఆరణ్మణై–2, తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రాల్లో నటించారన్నది గమనార్హం. -
చిన్న సినిమా చైనాలో దుమ్ముదులుపుతోంది
భారతీయ చిత్ర పరిశ్రమకు చైనా ఘన స్వాగతం పలుకుతోంది. ఇప్పటికే చైనాలో భారతీయ సినిమాలు తమ సత్తాను చాటాయి. దంగల్, సీక్రెట్ సూపర్‌స్టార్, హిందీ మీడియం, భజరంగీ భాయీజాన్ లాంటి చిత్రాలు వందల కోట్లను కొల్లగొట్టాయి. మూవీలో కంటెంట్ ఉంటే చాలు అక్కడ ఈజీగా వంద కోట్లను వసూలు చేయోచ్చు. ఇలా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు చాలా సినిమాలు చైనాకు క్యూ కట్టాయి. అయితే ఇదే వరుసలో గతేడాది వచ్చిన అంధాదున్ చిత్రం బాలీవుడ్లో చిన్న సినిమాగా రిలీజై.. రికార్డుల మోత మోగించింది. ఇక్కడ సెన్సేషన్ సృష్టించడమే కాకుండా.. చైనాలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన రెండో వారాంతంలోనే రెండు వందల కోట్లను కలెక్ట్ చేసింది. ఆయుష్మాన్ ఖురానా, టబు, రాధికా ఆప్టే కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఆధ్యంతం ఆసక్తిని రేకేత్తించేలా ఉంటుంది. అంధుడిగా నటిస్తూ.. జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి జీవితంలో ఎదురైన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. నాని హీరోగా తెరకెక్కుతున్న ‘జెర్సీ’ చిత్రాన్ని చైనాలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. మరి ఈ చిత్రం అక్కడ ఎలాంటి రిజల్ట్‌ని ఇస్తుందో చూడాలి.