పాటల కోసం కుస్తీలు
‘అబ్బాయితో అమ్మాయి’ సినిమాలో రెండు పాటల చిత్రీకరణ కోసం స్విట్జర్లాండ్, మ్యూనిచ్ వెళ్లారు. విపరీతమైన మంచు వర్షం. రోజూ లొకేషన్కెళ్లడం, ఖాళీగా తిరిగి వచ్చేయడం. మధ్యలో ఎప్పుడైనా వర్షం రాకపోతే పాట షూట్ చేసేవాళ్లు. హీరో నాగశౌర్య ఓకే కానీ, హీరోయిన్ పలక్ లల్వానీ మాత్రం చలికి తట్టుకోలేక ఒకటి, రెండుసార్లు స్పృహ తప్పి పడిపోయింది కూడా. ఎక్కడెక్కడి నుంచో చెక్క ముక్కలు ఏరుకొచ్చి, మంట లేసి ఆ చలి నుంచి తప్పించు కున్నారు. ఆ రోజు కొండలు, గుట్టలు దాటి బాగా ఎత్తై లొకేషన్‌కు వెళ్లారు.
వర్షం మొదలైంది. ఎంతసేపటికీ ఆగడం లేదు. ఆ వర్షంలో కిందికి రావడం రిస్కు. ఒకవేళ అక్కడే ఉందామనుకుంటే డేంజరస్. లక్కీగా ఓ గంటసేపు వర్షం ఆగింది. దీంతో వీళ్లు తిరిగి రాగలిగారు. ఇన్ని కుస్తీలు చేసి, ఎట్టకేలకు ఆ రెండు పాటలు పూర్తి చేశారు. రమేశ్‌వర్మ దర్శకత్వంలో వందనా అలేఖ్య జక్కం, కిరీటి పోతిని, శ్రీనివాస్ సమ్మెట నిర్మించిన ‘అబ్బాయితో అమ్మాయి’ ఈ నెల 25న విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమేరా శ్యామ్ కె. నాయుడు.