Abudul kalam
-
ఎనీ డౌట్? కలామ్ పేరును చంద్రబాబు సూచించారనేది కేవలం భ్రమ
తమ పార్టీ భావజాలానికి అనుగుణంగా ఉండటంతో ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ముర్మూ ఎంపికను వైఎస్సార్సీపీ స్వాగతించింది. మద్దతు ప్రకటించింది. రాష్ట్రం కోసం బేరాలాడకుండానే ముర్మూకు మద్దతు తెలపడమేమిటని ఎల్లో గ్యాంగ్ ఒక వాదాన్ని లేవ దీసింది. బేరాల ముసుగేసుకొని బీరాలుపోతున్న ఈ ప్రగతి నిరోధకుల నిజస్వరూపాన్ని ప్రజలు గమనించకుండా ఉండరు. సరిగ్గా కేంద్రంలో ఇవే పరిస్థితులు ఉండి, జగన్ గారి స్థానంలో బాబుగారు ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ముర్మూ ఎంపిక తర్వాత ఎల్లో మీడియా కథనాలు ఎలా ఉండేవి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండని ఒక ప్రకటన విడుదల చేస్తే లక్షల సంఖ్యలో పోస్టుకార్డులు వస్తాయి. అందులో కనీసం 90 శాతం మంది సరైన సమాధానమే రాస్తారు. ఎందుకంటే ఎల్లో మీడియా ఎప్పుడే కథనాన్ని ఎలా రాస్తుందో ప్రజలందరి అనుభవంలోకి వచ్చింది. ‘మొన్న ఢిల్లీకి వెళ్లినప్పుడు మోదీకి చంద్రబాబు ఈ సలహా ఇచ్చారు. ద్రౌపది ముర్మూను ఎంపిక చేయాలని గట్టిగా చెప్పారు.అందుకు ప్రధాని అంగీకరించారు. వాజ్పేయి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం చేత ముస్లిం మైనారిటీకి చెందిన అబ్దుల్ కలామ్ను బాబే నిలబెట్టించారు. ఇప్పుడు గిరిజన మహిళను సూచించి బాబు మరో ఘనకార్యం చేశారు’ అని రాసి ఉండేవారు. ఎనీ డౌట్? ఎల్లో మీడియా ప్రచారం వల్ల నిజంగానే కలామ్ను బాబే సూచించారని చాలామంది భ్రమపడ్డారు. ములాయంసింగ్ యాదవ్ చేసిన సూచనకు అంగీకరించి వాజ్పేయి కలామ్ అభ్యర్థిత్వాన్ని అంగీకరించారని చాలాకాలం తర్వాత గానీ బయటకు రాలేదు. పూర్తి వ్యాసం ఇక్కడ చదవండి: ఎల్లో హెచ్చులు ఢిల్లీ దాకా! -
కలాం పార్టీని నిషేధించండి
రాష్ట్రపతికి సమూగ సేవై ఇల్లం లేఖ టీనగర్ : మాజీ రాష్ట్రపతి, దివంగత అబ్దుల్ కలాం పేరిట ప్రారంభించిన పార్టీకి నిషేధం విధించాలంటూ రాష్ట్రపతికి సమూగ సేవై ఇల్లం (సామాజిక సేవా కేంద్రం) ఒక లేఖ రాసింది. చెన్నిమలైకు చెందిన సామాజిక సేవకుడు చొక్కలింగం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి రాసిన లేఖలో ఈ విధంగా తెలిపారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరిట ‘అబ్దుల్ కలాం లక్ష్య ఇందియ కట్చి’ అనే కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించారని తెలిపారు. అబ్దుల్ కలాం అత్యుత్తమ శాస్త్రవేత్తని, ఉత్తమ భారత పౌరుడిగా, దేశభక్తిగల నాయకుడిగా ఖ్యాతి చెందారన్నారని పేర్కొన్నారు. కోట్లాది మంది ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారని తెలిపారు. ఆయన ఉత్తమ మానవతాది మాత్రమేనని రాజకీయవేత్త కాదన్నారని పేర్కొన్నారు. అందువల్ల ఆయన పేరుతో పార్టీ ప్రారంభించడం అనవసరమని, దీనిపై పూర్తి విచారణ జరిపి ఆ పార్టీని నిషేధించాలని కోరుతున్నట్లు తెలిపారు. అబ్దుల్ కలాం పేరు ప్రతిష్టలకు ఎటువంటి భంగం వాటిల్లకుండా కాపాడాలని, దీనిగురించి భారత ఎన్నికల కమిషన్కు ఒక పిటిషన్ పంపినట్లు తెలిపారు.