ఎయిర్ రైఫిల్ షూటింగ్ అకాడమీ ప్రారంభం
కర్నూలు (టౌన్): స్థానిక వెంకటరమణ కాలనీలో ఎయిర్ రైఫిల్ షూటింగ్ అకాడమీని ఆదివారం ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి రామాంజనేయులు, జిల్లా రైఫిల్ షూటింగ్ సంఘం కార్యదర్శి బాషా ముఖ్యఅతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖ వంటి మహానగరాలకు పరిమితమైన రైఫిల్ షూటింగ్‌ను కర్నూలులో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు అకాడమీ సేవలను వినియోగించుకోవాలన్నారు.